INTERNATIONALNATIONALOTHERSTECHNOLOGY

చైనాకు చెందిన రోబోట్‌లు-పవర్ ఇన్వర్టర్ల దిగుమతులపై నిషేధం విధించిన అమెరికా

చైనాకు చెందిన రోబోట్‌లు-పవర్ ఇన్వర్టర్ల దిగుమతులపై నిషేధం విధించిన అమెరికా

అమరావతి: చైనాకు చెందిన టెక్నాలజీ ఉత్పత్తులపై అమెరికా ఉక్కుపాదం మోపుతోంది. విదేశాలలో తయారైన హ్యూమనాయిడ్-క్వాడ్రుపెడ్ రోబోట్‌లు- పవర్ ఇన్వర్టర్ల దిగుమతులపై అమెరికా నిషేధం విధించింది. ఈ చర్య చైనా తయారీదారులను అమెరికా మార్కెట్ నుండి దూరం చేసే అవకాశం ఉండటంతో పాటు, వాషింగ్టన్-బీజింగ్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు బావిస్తున్నారు. విదేశాలలో తయారైన “అధునాతన రోబోటిక్ పరికరాలు” అమెరికాకు జాతీయ-సైబర్ భద్రతాపరమైన ప్రమాదాలను కలిగిస్తున్నాయని యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (FCC) తెలిపింది. మొబైల్ రోబోట్‌లను రెండు కిలోగ్రాముల కంటే ఎక్కువ బరువు ఉండి, అడ్డంకులను తప్పించుకోవడంతో సహా స్వయంప్రతిపత్తితో కూడిన నావిగేషన్‌ను సాధించడానికి సెన్సార్లు, నెట్‌వర్క్ కనెక్టివిటీ-సాఫ్ట్‌ వేర్‌ను ఉపయోగించే పరికరాలు అన్ని ఈ పరిధిలో వస్తాయని పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచ హ్యూమనాయిడ్ రోబోల మార్కెట్‌లో దాదాపు 85 శాతం వాటాతో చైనా ఆధిపత్యం చెలాయిస్తోంది. చైనాకు చెందిన ‘యూనిట్రీ’, ‘ఏజీఐబాట్’ వంటి కంపెనీలు వేల సంఖ్యలో రోబోలను మార్కెట్లోకి తెస్తుండగా, అమెరికాకు చెందిన టెస్లా, ఫిగర్ ఏఐ వంటి సంస్థల ఉత్పత్తి వందల్లోనే ఉంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *