EDU&JOBSNATIONALOTHERS

ప్రశ్నపత్రాల లీకులకు పాల్పపడితే 10 ఏళ్ల జైలు,రూ.10 కోట్ల జరిమానా

లోక్‌సభలో మూజువాణి ఓటుతో ఆమోదం..

వందేమాతరం సవరణ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం..

లోక సభలో గందరగోళం సృష్టించిన కాంగ్రెస్ పార్టీ..

అమరావతి: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు బుధవారం లోక్‌సభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. బిల్లుపై సభలో తీవ్ర గందరగోళం నెలకొనగా, విపక్ష సభ్యులు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ బిల్లు చట్టంగా రూపొందడంతో ఇకపై గ్రూప్ (సిండికేట్) గా ఏర్పడి పేపర్ లీక్ పాల్పిడితే మొదటిగా పేపర్ లీక్ పాల్పడినవారికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, అలాగే రూ.10 కోట్ల వరకు జరిమానా విధిస్తారు. పేపర్ లీక్ కేసుల దర్యాప్తును పూర్తిచేసేందుకు 2 నెలల గడువును నిర్దేశించింది. అక్రమాలకు పాల్పడిన వ్యక్తులకు 2024 చట్టంలోని 5 శిక్షను, 10 సంవత్సరాలుగా, 50 లక్షల రూపాయల జరిమానా విధిస్తారు. కేసులను 3 నెలల వ్యవధిలో పరిష్కరించేందుకు ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఈ బిల్లు ప్రతిపాదించింది.

గందరగోళం సృష్టించిన:- కాంగ్రెస్ పార్టీ లోక సభలో గందరగోళం సృష్టించిన నేపధ్యంలో ప్రభుత్వం యాంటీ పేపర్ లీక్ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించింది. పోటీ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టడం, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని కేంద్రం స్పష్టం చేసింది.

వందేమాతరం సవరణ బిల్లుకు:- వందేమాతరం సవరణ బిల్లుకు రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదం లభించింది. అనంతరం రాజ్యసభ జూలై 30కి వాయిదా పడింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *