కేంద్ర మాజీ మంత్రి శరద్‌పవార్ కు తీవ్ర అస్వస్థత-ఆస్పత్రికి తరలింపు
అమరావతి: మహరాష్ట్ర ప్రాంతీయ పార్టీ అయిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్‌పవార్ (85) సోమవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు వెంటనే ఆయనను బారామతి నుంచి పుణెలోని రూబీ హాల్ క్లినిక్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. దగ్గు, జలుబుతో ఆయన బాధపడుతున్నారని, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందిపడుతున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. శరద్ పవార్ ఆరోగ్యం గురించి ఆయన కుమార్తె,,లోక్‌సభ ఎంపీ సుప్రియా సూలే మాట్లాడుతూ, తన తండ్రికి ఛాతీలో నొప్పి వచ్చిందని, ఐదు రోజుల పాటు యాంటీబయాటిక్స్ కోర్సు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.

