బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ జరిపిన ఆత్మాహుతి దాడులు 50 మంది మృతి
అమరావతి: పాకిస్థాన్‌లోని నైరుతి ప్రావిన్స్ అయిన బలూచిస్థాన్ మరోసారి రక్తసిక్తమైంది. బలూచిస్థాన్‌లో గత 40 గంటలుగా భీకర పోరు సాగుతోంది. బలూచ్ వేర్పాటువాద గ్రూపులు ఏకకాలంలో జరిపిన దాడులతో ఆ ప్రాంతం అట్టుడికిపోయింది. 40 గంటలుగా సాగుతున్న ఈ భీకర పోరులో ఇప్పటివరకు 145 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు బెలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ ఆదివారం క్వెట్టాలో వెల్లడించారు.ఇదే సమయంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటన చేసింది. పాకిస్థాన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో దాదాపు 17 మంది భద్రతా సిబ్బందితో సహా 50 మందిని మరణించిన ఘటనపై బాధ్యతవహిస్తూ ప్రకటించింది. ఆత్మాహుతి దాడి చేసిన ఇద్దరి ఫొటోలను విడుదల చేసింది. ఆత్మాహుతి దాడలకు పాల్పపడింది యువతులే కావడం గమనార్హం.వీరిలో ఒకరి పేరు అసిఫా మెంగల్ (23). మరో యువతికి సంబంధించిన వివరాలను బీఎల్ఏ తెలపలేదు. ఆమెకు సంబంధించిన ఓ వీడియో మాత్రం బయట పెట్టింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైన్యం, ISI, పోలీసులు, ప్రభుత్వ కార్యాలయాలే లక్ష్యంగా 11 నగరాల్లో భారీ దాడులు చేస్తోంది. రాజధాని క్వెట్టా శివార్లలో అత్యంత దారుణమైన పరిస్థితి నెలకొంది. అక్కడ బలూచ్ యోధులు అవామ్ బ్యాంక్ నుంచి 3.8 మిలియన్ల రూపాయలను దోచుకుని, ఆపై దానిని తగలబెట్టారు.

