మణిపుర్ నూతన ముఖ్యమంత్రిగా యుమ్నమ్ ఖేమ్‌చంద్ సింగ్ ప్రమాణస్వీకారం
అమరావతి: మణిపుర్ నూతన ముఖ్యమంత్రిగా యుమ్నమ్ ఖేమ్‌చంద్ సింగ్ ప్రమాణస్వీకారం చేశారు. మాజీ మంత్రి, కుకీ నాయకురాలు నెమ్చా కిప్ గెన్, నాగాలకు చెందిన లోసి దిఖోలు కొత్త ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రులు ప్రమాణం చేశారు. ఈ మేరకు లోక్‌భవన్‌లో మణిపుర్ గవర్నర్ అజయ్ కుమార్ బల్లా వారి చేత ప్రమాణస్వీకారం చేయించారు. నెమ్చా కిప్ గెన్ వర్చువల్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.
రాష్ట్రపతి పాలనను రద్దు:- మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను రద్దు చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేయడంతో మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. రాజ్యాంగంలోని 356వ అధికరణలోని క్లాజ్ (2) ద్వారా తనకు సంక్రమించిన అధికారాలతో 2025 ఫిబ్రవరి 13న మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ జారీ చేసిన ఆదేశాలను రద్దు చేస్తున్నట్టు రాష్ట్రపతి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2026 ఫిబ్రవరి 4వ తేదీ నుంచి తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చినట్టు తెలిపారు.జాతుల మధ్య ఘర్షణలతో మణిపూర్ అట్టుడకడంతో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ గతేడాది రాజీనామా చేశారు. దీంతో తొలుత 6 నెలలపాటు అక్కడ రాష్ట్రపతి పాలన విధించి మరోసారి దానిని పొడిగించారు.

