ఇస్లాం మతంలోకి మారమని బలవంతం-ఆత్మహత్య చేసుకున్న యువతి
అమరావతి: కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో సోనా ఎల్డోస్(23) టీచర్ ట్రైనింగ్ కోర్సు (TTC) చేస్తున్న యువతి ఆత్మహత్య చేసుకుంది.. ఆమె ప్రియుడు అయిన రమీజ్,,అతని కుటుంబ సభ్యులు వివాహం చేసుకోవాలంటే ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి చేశారని,, అందుకే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి,,వీరి ఇంటిలో పనిమనిషి బిందులు ఆరోపించారు.. కేరళలోని కోతమంగళానికి చెందిన సోనా ఎల్డోస్ శనివారం తన నివాసంలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది..తొలుత పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేశారు..అయితే తరువాత మృతురాలు రాసిన సూసైడ్ నోట్ లభించడంతో ఈ కేసును “మతమార్పిడి కోసం శారీరక దాడి, మానసిక వేధింపులు” అనే భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 69 ప్రకారం కేసు నమోదు చేశారు..
మతంలోకి మారమని:- సోనా ఎల్డోస్ కు, రమీజ్ అనే యువకుడు పరిచయం కావడం,అది కాస్త ప్రేమగా మారింది..వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అభిప్రాయానికి వచ్చారు..వివాహం నమోదు చేసుకునే నెపంతో రమీజ్,, సోనాను వాళ్ల ఇంటికి తీసుకెళ్లాడని,,అక్కడ రమీజ్,అతని కుటుంబసభ్యులు సోనాను ఇస్లాం మతంలోకి మారితేనే వివాహం జరుగుతుందని బెదిరించినట్టు సమాచారం..తమ మతంలోకి మారమని రమీజ్ తనను బలవంతం చేశాడని సోనా తన సూసైడ్ నోట్ లో పేర్కొంది..
చాలా కాలంగా చిత్రవథ చేశారు:- రమీజ్ కుటుంబం గతంలో వివాహ ప్రతిపాదనను తీసుకువచ్చిందని,,పెళ్లి కోసం సోనాను తమ మతంలోకి మారాలని పట్టుబట్టారని సోనా తల్లి తెలిపింది..సోనా మొదట దీనిని ప్రేమతో అంగీకరించిందని, కానీ రమీజ్ అనైతిక వ్యవహారాలు చూసిన తర్వాత నిరాకరించిందని అమె తెలిపారు.. తన కుమార్తె రమీజ్ ను ఎంతగానో ప్రేమించిందని, అయితే, మతం మారాలంటూ చాలా కాలంగా చిత్రవథ చేశారని వెల్లడించింది..వారి వేధింపులు తట్టుకోలేక సోనా ఎట్టిపరిస్థితుల్లోనూ మతం మారనని తేల్చి చెప్పిందని పనిమనిషి బిందు మీడియాకి ఇచ్చిన ఇంటర్వూలో చెప్పింది.. దీంతో సోనాను ఒక గదిలో బంధించారని,,సోనా సోదరుడు బాసిల్ ని కూడా కొట్టారని బిందు తెలిపింది..తను ఎదుర్కొన్న చిత్రవధలకు సంబంధించిన వివరాలను సోనా తన సూసైడ్ నోట్ లో రాసింది..దింతో రమీజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.