8 మంది చిన్నారుల ఉసురు తీసిన వేసవి సెలవులు…?
హైదరాబాద్: హైదరాబ్ లోని గుల్జార్ హౌస్ జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందగా వారిలో 8 మంది ఎనిమిదేళ్ల వయస్సు లోపు వారు ఉన్నారు.. పాఠశాలలకు ఎండాకాలం సెలవులు ఇవ్వడంతో నగరంలోని అత్తాపూర్, బంజారాహిల్స్ ప్రాంతాల నుండి గుల్జార్ హౌస్ ప్రహ్లాద్ (70) ఇంటికి వచ్చారు.. వీరంతా రాత్రి పొద్దుపోయే వరకు ఆటా, పాటలతో గడిపారు.. రాత్రి 11 గంటల తర్వాత కొంత మంది, తర్వాత మిగిలిన వారు నిద్రకు ఉపక్రమించారు..ఉదయం నిద్ర లేవగానే పిల్లలను తీసుకుని నగరంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్లాన్ చేసుకున్నారు. వారి ప్లాన్ చెల్లా చెదురైంది.. తెల్లవారు జామున సుమారు 6 గంటల ప్రాంతంలో చల్లదనం కోసం వేసుకున్న ఏసీ కంప్రెషర్ బలి తీసుకుంది..కంప్రెషర్ పేలుళ్లతో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి.. దీనికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తోడైంది.. ఫలితంగా అక్కడ ఉన్న 21 మందిలో నిద్రలో ఉన్న ముగ్గురు అగ్నికీలలకు ఆహుతయ్యారు..వారి మృతదేహాలు గుర్తించలేనంతగా మంటలలో కాలిపోయాయి.. మిగిలిన వారిని ఆస్పత్రులకు తరలించగా చికిత్స పొందుతూ వారిలో 14 మంది చనిపోయారు..మొత్తం మీద 17 మంది మరణంకు కారణమైన అగ్ని ప్రమాదం నగరంలో అక్రమంగా నిర్మిస్తున్న బహుళ అంతస్థుల భవనాలలో నివాసముంటున్న వారి భద్రతను ప్రశ్నిస్తోంది.ఈ అగ్నిప్రమాదం జరిగుందుకు కారణలు ఏమిటని తెలియాల్సి ఉంది??