ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేశారుగా-ప్రధాని మోదీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేశారుగా అంటూ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు.. ప్రపంచం మొత్తం ఏ.పి వైపు చూసేలా మీరు తీసుకున్న చర్యలు అభినందనలు తగ్గావని అన్నారు..శనివారం 21వ తేదిన యోగా డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్బలో 5 లక్షల మందికి పైగా జనాలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.. యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన శుక్రవారం సాయంత్రమే విశాఖకు చేరుకున్నారు..భువనేశ్వర్‌లో బహిరంగ సభ అనంతరం,,నేరుగా విశాఖకు చేరుకున్నారు.. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేష్, ఎంపీ భరత్‌లు స్వాగతం పలికారు..ఈ సందర్భంగా యోగాంధ్ర నిర్వహణ ఏర్పాట్లపై ప్రధాని మాట్లాడారు.. ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చేసేలా చేశారుగా అంటూ సీఎం చంద్రబాబుకు కితాబిచ్చారు..యోగాంధ్ర ద్వారా సరికొత్త రికార్డ్ సృష్టిస్తు్న్నామని ప్రధానితో సీఎం చంద్రబాబు చెప్పారు..యోగాంధ్ర ఏర్పాట్ల గురించి తెలుసుకున్న ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్ నాయకుల పనితీరు అభినందనియమన్నంటూ అభినందించారు.

