NATIONAL

దశాబ్దం కాలం ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న యుపీఐ

అమరావతి: కరోనా తరువాత భారతదేశంలో ప్రవేశ పెట్టిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)కి శనివారంతో దశాబ్దం ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వివరాలను విడుదల చేస్తూ.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రియల్-టైమ్ చెల్లింపుల లావాదేవీల్లో ఏకంగా 49 శాతం వాటాతో భారతదేశం అగ్రస్థానంలో నిలిచిందని వెల్లడించింది.గణాంకాల ప్రకారం.. కేవలం 2026 జనవరి నెలలోనే యూపీఐ ద్వారా 21.70 బిలియన్ల లావాదేవీలు( రూ.28.33 లక్షల కోట్లు) జరిగాయని పేర్కొంది.

డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మకమైన:- దేశంలోని మొత్తం రిటైల్ డిజిటల్ లావాదేవీల్లో 81 శాతం యూపీఐ ద్వారానే జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.యుపీఐ ప్రారంభమైన నాటి నుంచి లావాదేవీల పరిమాణంలో 12,000 రెట్లు, విలువలో 4,000 రెట్లకు పైగా వృద్ధిని నమోదు చేసింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ సైతం యూపీఐని ప్రపంచంలోనే అతిపెద్ద రియల్-టైమ్ చెల్లింపుల వ్యవస్థగా అభివర్ణించింది. కేవలం లావాదేవీల సంఖ్యకే పరిమితం కాకుండా యూపీఐ సామాన్యుడి జీవితంలో కూడా భాగమైంది. భారత యూపీఐ వ్యవస్థ పనితీరు, భద్రత, వేగాన్ని ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ లాంటి అంతర్జాతీయ సంస్థలు ప్రశంసించాయి. ప్రస్తుతం యూఏఈ, సింగపూర్, ఫ్రాన్స్, శ్రీలంక, మారిషస్ సహా 8 దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *