జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు జైషే మమ్మద్ సంస్థ ఉగ్రవాదులు హతం
అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని ఉదంపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో బుధవారం మధ్యహ్నం చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్‌లో పాకిస్తాన్ కు చెందిన ఇద్దరు జైషే మమ్మద్ ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతం చేశాయి. వీరిలో ఒకడు ఇదే ప్రాంతంలో గత సంవత్సరాలుగా చురుకుగా పనిచేస్తున్న “ఉగ్ర సంస్థ జైషే” టాప్ కమాండర్ అవు మావియా కాగా మరొకడు జబ్బర్ అనే ఉగ్రవాదిగా గుర్తించినట్టు అధికారులు తెలిపారు.’కియా’ పేరుతో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ ప్రస్తుతం కొనసాగుతోంది.
గుహలో దాక్కుకున్నట్టు:- అధికారులు వెల్లడించిన సమాచారం మేరకు… జైషేకు చెందిన ఇద్దరు ఉగ్రవాదుల తాలుక సమాచారం అందడంతో భద్రతా దళాలు, సీఆర్‌పీఎఫ్,జమ్ముకాశ్మీర్ పోలీసు బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.వీరిని గమనించిన మిలిటెంట్లు కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి పారిపోయారు. భద్రతదళాలు నిఘా డ్రోన్ ను ఉపయోగించి ఉగ్రవాదులు ఒక గుహలో దాక్కుకున్నట్టు గుర్తించారు.గుహాను చుట్టుముట్టిన భద్రతా బలగాలు కాల్పులు జరిపడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎన్ కౌంటర్ అనంతరం అక్కడ పరిశీలించిన భద్రతా బలగాలకు, గుహ మొదట్లో ఒక ఉగ్రవాది, గుహలోపల మరొక ఉగ్రవాది మృతదేహాలను గుర్తించారని అధికారులు తెలిపారు.హతం అయిన ఉగ్రవాదుల నుంచి ఒక ఎం-4 కార్బైన్, ఒక ఏకే-47 రైఫిల్, మరికొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

