NATIONAL

ఇద్దరు పెళ్లి కొడుకులు,ఒక పెళ్లి కుతూరు-పురాతనమైన సంప్రదాయం

అమరావతి: వందల సంవత్సరాల నుంచి వస్తున్న మా అచారలను కాపాడుకొవడం మా వంతు కర్తవ్యం.. జోడిధార‌ణ సంప్రదాయం అనేది నమ్మకంపై ఆధారపడి వుంటుందని పెళ్లి కొడుకులు తెలిపారు..విషయంలోకి వెళ్లితే…. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని సిర్‌మౌర్ జిల్లాలో జ‌రిగింది.. షిల్లాయి గ్రామానికి చెందిన ప్ర‌దీప్ నేగి, క‌పిల్ నేగి అనే అన్నాద‌మ్ముళ్లు,, స‌మీపంలోని కున్హ‌త్ గ్రామానికి చెందిన సునీతా చౌహాన్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు..ఆ ముగ్గురూ హ‌ట్టి తెగ‌కు చెందినట్లు ట్రీబ్యూన్ మీడియాకు చెందిన పంకజ్ శర్మ రిపోర్టు చేశాడు..తెగ‌లో ఇప్పటి వ‌ర‌కు ఈ వివాహ సంప్ర‌దాయం చాలా గోప్యంగా జ‌రిగేది.. నేగి సోద‌రులు మాత్రం త‌మ పెళ్లిని ఘ‌నంగా చేసుకున్నారు..

శ‌తాబ్ధాల క్రితం నాటి సంప్ర‌దాయాన్ని నిల‌బెట్టిన‌ట్లు వాళ్లు తెలిపారు..వివాహ వేడుకను అంద‌రి అనుమ‌తితో శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు.. బ‌హుభార్య‌త్వానికి సంబంధించిన ఈ వేడుక‌ను ఆ గ్రామంలో చాలా ఘనంగా జరిపించారు..హ‌ట్టి వ‌ర్గ‌ ప్ర‌జ‌ల్లో ఉండే ఈ సంప్ర‌దాయాన్ని జోడిధార‌ణ లేదా ద్రౌప‌ది ప్రాథ అని పిలుస్తారు..ఈ సంప్ర‌దాయంలో అన్నాద‌మ్ముళ్లు ఒకే భార్య‌ను పంచుకుంటారు.. సిర్‌మౌర్ జిల్లాల్లోని ఈ సంప్ర‌దాయం ఇక్క‌డ ఆచారంగా మారింది..ఉత్త‌రాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఆచారం కొన‌సాగుతున్న‌ది..ఇందుకు ప్రధాన కారణం కుటుంబ ఐక‌మ‌త్యాన్ని కాపాడుకొవడం,,పూర్వీకుల భూముల‌ను ర‌క్షించుకునేందుకు, ఆ తెగలోని మ‌హిళ‌లు వితంతువులుగా ఉండ‌కూడ‌ద‌ని ఈ ప‌ద్ధ‌తిలో వివాహం చేసుకుంటారు..

మా చ‌రిత్ర ప‌ట్ల మాకు గ‌ర్వంగా:- ప్ర‌దీప్ నేగి హిమచల్ ప్రదేశ్ ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లో ప‌నిచేస్తున్నాడు..అయన సోద‌రుడు క‌పిల్‌,, విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు..ఇద్ద‌రూ వేరువేరు రంగాల్లో వున్నప్పటికి,, సునీతాను పెళ్లాడే విష‌యంలో ఇద్ద‌రూ శాస్త్రాల‌ను అనుస‌రించారు…ప‌ర‌స్ప‌ర అంగీకారంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ప్ర‌దీప్ తెలిపాడు..మా ఆచారాల‌ను మేం పాటిస్తున్నమని,,మా చ‌రిత్ర ప‌ట్ల మాకు గ‌ర్వంగా ఉంద‌న్నాడు.. పార‌ద‌ర్శ‌క‌త‌ను తానేప్పుడూ న‌మ్ముతాన‌ని, నేను విదేశాల్లో ఉన్నా,,వివాహంతో భార్య‌కు స‌పోర్టు, సెక్యూర్టీ, ప్రేమ ల‌భిస్తుంద‌ని క‌పిల్ తెలిపాడు..ఈ పెళ్లి త‌న ఇష్ట‌ప్ర‌కార‌మే జ‌రిగింద‌ని,, న‌న్ను ఎవ‌రూ వ‌త్తిడి చేయ‌లేద‌ని,,ఈ ఆచారం గురించి త‌న‌కు సంపూర్ణంగా అవగాహన వుందని,, అంద‌రం క‌లిసి ప్ర‌తిజ్ఞ చేశామ‌ని, మా బంధంపై నాకు న‌మ్మ‌కం ఉంద‌ని వ‌ధువు సునీత తెలిపింది.. మూడు రోజుల పాటు పెళ్లి వేడుక‌ను వైభ‌వంగా నిర్వ‌హించారు..గ్రామ‌స్థులు, బంధువులు ఆ పెళ్లికి హాజ‌ర‌య్యారు.. అతిథుల‌కు స్థానిక ఆచారాల ప్ర‌కార‌మే విందుభోజ‌నాలు ఏర్పాటు చేశారు..పాహ‌రి సంప్ర‌దాయ పాట‌లు, నృత్యాల‌తో సందడి చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *