ఈసీ భుజాలపై తుపాకీ పెట్టి,,ఓట్ల రాజకీయం చేస్తున్నారు- CEC జ్ఞానేశ్ కుమార్
అమరావతి: ఓట్ చోరీ అంటూ కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఘాటుగా స్పందిస్తూ రాహుల్ వ్యాఖ్యలు భారత రాజ్యాంగాని అవమానించేవిగా వున్నాయని అన్నారు.. అదివారం మీడియా సమావేశం నిర్వహించి సమాధానమిస్తూ,, “మాకు అన్నిపార్టీలు సమానమే..ఏ పార్టీ మీదా పక్షపాతం లేదు., ఓటర్ లిస్టులో తేడాలు ఉంటే 15 రోజుల్లో మాకు రిపోర్ట్ చేయండి అని అన్నారు..
పౌరుల్లో భ్రమలు సృష్టించడానికి:- బిహార్ ఓటర్ల జాబితాలోని లోపాలను తొలగించడమే లక్ష్యంగా ‘ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ’ (SIR )చేపట్టామని,, కొన్ని పార్టీలు దాని గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని, ఇది తీవ్ర ఆందోళనకరమైన విషయమని అన్నారు..కొందరు నేతలు పౌరుల్లో భ్రమలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు..ఓటర్ల వివరాలు వారి అనుమతి లేకుండా రాజకీయ నాయకులు బయటపెట్టారు..మీ బెదిరింపులకు ఈసీ భయపడదు.. రాజ్యాంగపరమైన విధుల నుంచి మేం తప్పుకోం.. ఈసీ భుజాలపై తుపాకీ పెట్టి,, ఓట్ల రాజకీయం చేస్తున్నారు” అని జ్ఞానేశ్ కుమార్ ఆక్షేపించారు.. కాంగ్రెస్ పార్టీతో సహా ఇండియా కూటమిలోని పార్టీలపై ఆయన పరోక్షంగా విమర్శలు సంధించారు..