పీ.ఓ.కేను భారత్‌కు అప్పగించడం మినహా కశ్మీర్ అంశంలో పాక్‌తో ఎలాంటి చర్చలు ఉండవు-ప్రధాని మోదీ
జాతీయ భద్రత విషయంలో రాజీ అనే మాటే లేదు..
అమరావతి: భారతదేశంలో ఉగ్రవాదులను చొప్పించి అమాయకుల ప్రాణాలు బలిగొనడం,,తరువాత భారత్ చిన్నపాటి చర్యలకు దిగితే,వెంటనే అమెరికా లేదా ఇతర దేశాల మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ చేసుకోవడం ఉగ్రవాద దేశామైన పాకిస్తాన్ కు ఆలవాటుగా మారిపోయింది..అయితే ఏప్రిల్ 22వ తేదిన పహల్గమ్ లో అమాయకులైన 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న తరువాత కూడా పాకిస్తాన్ భారతదేశం నుంచి చిన్నపాటి ప్రతిఘటన ఎదురు అవుతుందని ఉహించింది..అయితే ఇందుకు విరుద్దంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం కఠినమైన చర్యలకు దిగడంతో,దిక్కుతొచని పాకిస్తాన్ మళ్లీ అమెరికాను శరణవేడుకుంది..అమెరికా సూచించిన విధంగా పాకిస్తాన్ శనివారం డిజిఎంఓ స్థాయి అధికారి భారతదేశంలోని డిజిఎంఓ స్థాయి అధికారికి ఫోన్ చేసి,కాల్పుల విరమణ పాటించాలి అంటూ వేడుకున్నాడు..ఇందుకు భారత్ అంగీకరించింది..అయితే వెంటనే నిన్న రాత్రి 7 గంటల నుంచి మళ్లీ సరిహద్దులను నుంచి పాకిస్తాన్ డ్రోన్లు,,షాలింగ్స్ తో రెచ్చకొట్టే దాడులకు దిగింది..దీంతో భారత ఆర్మీ కూడా పాకిస్థాన్ లోని 26 ప్రాంతాలపై దాడులు చేసి ప్రతీకారం తీర్చుకుంది.. పేరుకు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా ఇరు దేశాల మధ్య చిచ్చు రగులుతూనే ఉండటంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.. ఈ క్రమంలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో మాట్లాడారు..ఈ సంభాషణలో ప్రధాని మోదీ పొరుగు దేశంతో చర్చించాల్సిన ఏకైక విషయం పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకె) తిరిగి అప్పగించే విషయంపై మాత్రమే అని స్పష్టం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి..

“కశ్మీర్ విషయంలో మాకు చాలా స్పష్టమైన వైఖరి ఉంది.. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) తిరిగి రావడం అనే ఒకే ఒక విషయం మిగిలి ఉంది.. మాట్లాడేందుకు ఇంకేమీ లేదు.. ఉగ్రవాదులను అప్పగించడం గురించి వారు మాట్లాడితే మనం మాట్లాడుకోవచ్చు..నాకు వేరే ఏ అంశం ఉద్దేశం లేదు” అని ప్రధాని మోదీ అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్‌తో చెప్పినట్లు తెలుస్తోంది.. అలాగే ఎవరూ ఈ అంశంపై మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని మోదీ తేల్చి చెప్పినట్లు సమాచారం..భారతదేశం తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది..ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్న సమయంలో అంతర్జాతీయ సమాజానికి, ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్ కు,, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరిహద్దు దాడులను ఇకపై సహించబోమని,, అలాంటి చర్యలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు..జాతీయ భద్రత విషయంలో ప్రభుత్వం రాజీ అనే మాటే లేదని స్పష్టం చేస్తొంది.. సోమవారం మధ్యాహ్నం భారత్-పాక్ DGMO ల మధ్య సమావేశం జరగనుంది..ఎలాంటి పరిణామలు చోటు చేసుకుంటాయో అనేది వేచి చూడాల్సిందే.?

