NATIONAL

దేశంలో జనగణనకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ

అమరావతి: దేశంలో జనగణనకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ కేంద్ర హోంశాఖ సోమవారం విడుదల చేసింది.. రెండు దశల్లో దేశంలో జనగణన ప్రక్రియ జరగనుంది..2027 మార్చి 1వ తేదీ నాటికి పూర్తి కానుంది. ఈసారి జనగణనతో పాటు కుల గణననూ కేంద్రం నిర్వహించనుంది..2011 తరువాత జనగణన 2021న జరగాల్సి వుంది..కరోనా కారణంగా జనగణన వాయిదా పడింది..15 సంవత్సరల తరువాత చేపట్టబోయే 16వ జనగణన ప్రక్రియను 2027 మార్చి 1వ తేదీ నాటికి పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది.. ఈ క్రమంలో తొలి విడతలో 2026 అక్టోబర్ 1వ తేది నాటికి జమ్ముకశ్మీర్, లద్ధాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో జనగణను పూర్తి చేయనున్నది.. మార్చి 2027 నాటికి మిగిలిన ప్రాంతాల్లోనూ ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు కేంద్రం హోంశాఖ తెలిపింది..జనగణన నిర్వహణ కోసం మొత్తం 34 లక్షల మంది గణకులు, సూపర్ వైజర్లు,మరో 1.34 లక్షల మంది సిబ్బంది జనగణన పక్రియను చేపట్టనున్నారు.. ఈసారి జనాభా లెక్కల సేకరణ డిజిటల్ ఫార్మెట్ ద్వారా రూపంలోనే జరుగుతుంది.. ప్రభుత్వం తెలిపే వెబ్ సైట్స్,,యాప్ లలో ప్రజలు సొంతంగానే తమ వివరాలను నమోదు చేసే వెసులుబాటునూ కల్పించారు.. సమాచార సేకరణ, బదిలీ, స్టోరేజీని అత్యంత కట్టుదిట్టంగా చేపడుతున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *