శిఖరంపై కలశంకు బంగారం తాపడం పూర్తి
అమరావతి: అయోధ్యలోని రామమందిరం శిఖరంపై కలశంకు బంగారం తాపడం పూర్తి అయింది..జూన్ 5వ తేదీన జరగనున్న రామ్ దర్బార్ ప్రాణప్రతిష్ఠ నేపధ్యంలో ఆలయంకు సంబంధించిన పనులు వేగంగా పూర్తి కావచ్చాయి.. ఆలయ మొదటి అంతస్తు నుంచి 161 అడుగులు ఎత్తైన శిఖరం వరకు ఆలయ వైభవాన్ని,, అద్భుతమైన రూపం దూరం నుంచి కనిపిస్తుంది..ఇది ఆలయ ప్రకాశవంతమైన రూపాన్ని పెంచుతుంది..ఉత్తర భారతదేశంలో అధ్భుతమైన స్వర్ణ ఆలయంగా నిర్మాణం జరిగిందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పేర్కొన్నారు.. దేవాలయ ప్రాంగణంలో జరుగుతున్న అన్ని పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం నిర్మాణ పనులకు సంబంధించిన అన్ని పరికరాలను తొలగించే పని జరుగుతోందని ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా వెల్లడించారు..జూన్ 5వ తేదీన జరగనున్న రామ్ దర్బార్ ప్రాణప్రతిష్ఠ సమయంలో వీఐపీ VIP పాస్లు రద్దు చేశారు.

