పాక్ ఇంటెలిజెన్స్ అధికారితో సోనమ్ వాంగ్‌చుక్ కు సంబంధాలు
అమరావతి: ప్రశాంతమైన జీవన విధానన్ని పాటిస్తూన్న లద్దాఖ్ ప్రజల పేరును అడ్డం పెట్టుకుని,, కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలనే డిమాండ్‌తో ఇటీవల నిరాహార దీక్ష చేసిన పర్యావరణ కార్యకర్త అని చెప్పుకుంటున్న సోనమ్ వాంగ్‌చుక్ కు పాకిస్థాన్ తో సంబంధాలున్నాయని లద్దాఖ్ డీజీపీ ఎస్డీ సింగ్ జామ్వాల్ శనివారం లెహ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు..ఇటీవల సోనమ్ వాంగ్‌చుక్ పాకిస్తాన్ లో జరిగిన డాన్ ఈవెంట్‌కు హాజరయ్యారు కావడం,, బంగ్లాదేశాల్లో పర్యటించారని,,ఈ పర్యటనల వెనుక వున్న కుట్రకోణంపై ఆందోళన వ్యక్తం చేశారు..శుక్రవారం లెహ్‌లో నిరసనలను రెచ్చకొట్టినందుకు,, వాంగ్చుక్ను జాతీయ భద్రతా చట్టం (NSA)కింద అరెస్టు చేసిన అనంతరం వాంగ్ చుక్ ను రాజస్థాన్‌లోని జోథ్‌పూర్ సెంట్రల్ జైలుకు ఆయనను తరలించారు..
పాక్, వాంగ్‌చుక్‌తో ఎప్పటికప్పుడు:- పాక్ ఇంటెలిజెన్స్ అధికారిని ఇటీవల పోలీసులు అరెస్టు చేశారని,, అతను వాంగ్‌చుక్‌తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపుతూ వచ్చారని తెలిపారు..”సరిహద్దుల వెంబడి” సమాచారాన్ని పంపుతున్న పాక్ పీఐఓని ఇటీవల అరెస్టు చేసినట్లు తెలిపారు..ఇందుకు సంబంధించిన రికార్డులు ఉన్నాయన్నారు.. ప్రస్తుతం వీటన్నింటిపై విచారణ జరుపుతున్నాం అని చెప్పారు..ఈ నెల 24న లెహ్‌లో జరిగిన నిరసనల సందర్భంగా హింసను వాంగ్‌చుక్ రెచ్చగొట్టారని కూడా డీజీపీ వెల్లడించారు.