NATIONALOTHERSSPORTS

మ‌హిళ‌ల వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్-2025 షెడ్యూల్ విడుదల

అమరావతి: మ‌హిళ‌ల వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్-2025 షెడ్యూల్ ను ఐసీసీ సోమ‌వారం విడుదల చేసింది..భార‌త్,, శ్రీ‌లంక సంయుక్తంగా ఆతిథ్య‌మిస్తున్న ఈ టోర్నీ సెప్టెంబ‌ర్ 30వ తేదిన మొద‌లై నవంబరు 2వ తేది వరకు జరుగనున్నది..భారత్,,శ్రీలంక దేశాల్లో మెగా టోర్నీ జ‌రిపేందుకు ఐసీసీ సన్నాహకాలు చేప‌ట్టింది..రెండు దేశాల్లో 5 వేదిక‌ల‌పై 13వ ఎడిష‌న్ వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు తెలిపింది..ఈసారి టైటిల్ కోసం 8 జ‌ట్లు పోటీ ప‌డుతున్నాయి.. భార‌త్‌,,శ్రీ‌లంక‌,,ఆస్ట్రేలియా,,ఇంగ్లండ్,,ద‌క్షిణాఫ్రికా,,న్యూజిలాండ్,, బంగ్లాదేశ్,,పాకిస్థాన్‌లు త‌ల‌ప‌డ‌నున్నాయి..సెప్టెంబ‌ర్ 30వ తేదిన జ‌రుగ‌బోయే ప్రారంభ మ్యాచ్ లో బంగ్లాదేశ్‌తో భార‌త జ‌ట్టు త‌ల‌ప‌డ‌నుంది..తొలి సెమీ ఫైన‌ల్ అక్టోబర్ 29న గువాహ‌టి లేదా కొలంబోలో,,రెండో సెమీఫైనల్ అక్టోబ‌ర్ 30వ తేదిన బెంగ‌ళూరులో జ‌రుగుతాయి..రెండు రోజుల విరామం అనంత‌రం నవంబ‌ర్ 2వ తేదిన ఫైన‌ల్స్ జరుగుతాయని తెలిపింది..

12 ఏళ్ల త‌రువాత మ‌హిళ‌ల వ‌రల్డ్ క‌ప్ టోర్నీకి భార‌త్ ఆతిథ్యం ఇస్తోంది..ఇండియాలోని నాలుగు స్టేడియాల్లో,, లంక‌లోని ఒక స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వ‌హణ‌కు ఆమోదం ఐసీసీ అమోదం తెలిపింది..చిన్న‌స్వామి స్టేడియం (బెంగ‌ళూరు),,ఏసీఏ స్టేడియం(గువాహ‌టి),, హోల్క‌ర్ మైదానం(ఇండోర్),,ఏసీఏ-వీడీసీఏ స్టేడియం(విశాఖ‌ప‌ట్ట‌ణం)లో వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌లు నిర్వ‌హించ‌నున్నారు..శ్రీ‌లంకలో కొలంబోలోని ఆర్.ప్రేమ‌దాస స్టేడియం మ్యాచ్‌ల‌కు వేదిక కానుంది.,2022లో విజేత‌గా నిలిచిన‌ ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియ‌న్‌గా బరిలో దిగనున్నది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *