భారతదేశంలో పర్యటించనున్న రష్యా అధ్యక్షడు వ్లాదిమిర్ పుతిన్
అమరావతి: వ్లాదిమిర్ పుతిన్ తర్వలోనే భారతదేశంలో పర్యటించనున్నారని,,పుతిన్ పర్యటనకు సబంధించిన తేదీలు దాదాపు ఖరారు అయినట్లు జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్ పేర్కొన్నారు.. ప్రస్తుతం అజిత్ ధోవల్,, మాస్కోలో పర్యటిస్తున్నారు..అగష్టు చివర వారంలో ఈ సమావేశం జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది..భారత్, రష్యా మధ్య రక్షణ,,భద్రత భాగస్వామ్యం అంశాలపై ధోవల్ క్రెమ్లిన్ తో చర్చిస్తున్నట్లు సమాచారం..
అలాగే ట్రంప్, పుతిన్ లు కూడా సమావేశం కానున్నారని,,నేతల సమావేశంకు సంబంధించి వేదికను ఖరారు చేసినట్లు రష్యా అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.. వేదిక ఎక్కడ అనే విషయం ప్రకటించనప్పటికి,,సమావేశం వేదిక విషయంలో రెండు దేశాలు అంగీకరానికి వచ్చినట్ల సమాచారం..

