భారత్ లోనే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ప్రొడక్షన్ కు రూ.7,280 కోట్లు-మంత్రి అశ్వినీ వైష్ణవ్
కేంద్ర కేబినెట్ సమావేశం…
అమరావతి: రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ప్రొడక్షన్ కు రూ.7,280 కోట్లు,,పుణె నగరంలో మెట్రో రైలు పొడిగింపునకు రూ.9,858 కోట్లు,, ద్వారక -కర్నాలస్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు రూ.1,457 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు..బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ న్యూఢిల్లీలో సమావేశమై తీసుకున్న నిర్ణయాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. కేంద్ర కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాల కోసం ప్రభుత్వం మొత్తం రూ.19, 919 కోట్లు ఖర్చు చేస్తోందని,,ఈ ప్రాజెక్టులన్నీ సకాలంలో పూర్తవుతాయని మంత్రి అశ్విని వైష్ణవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడాన్ని తగ్గించి,,స్వదేశంలోనే సాంకెతిక పరిజ్ఞానంను అభివృద్ధి చేసుకునే దిశగా కేంద్రం ప్రణాళిక అమలు చేస్తొందన్నారు..రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ప్రొడక్షన్ (REMP) పథకం ద్వారా భారత్‌లో హైటెక్ మాగ్నెట్లను తయారు చేయడమే లక్ష్యం..ఈ మాగ్నెట్లను ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ ఫోన్లలో ఉపయోగిస్తారు.

