ప్రేమ,శాంతి,కరుణమైయుడి సందేశాన్ని ప్రతిబింబిస్తుంది-ప్రధాని మోదీ
అమరావతి: క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలోని కేథడ్రల్ చర్చ్ ఆఫ్ ది రిడంప్షన్‌లో మార్నింగ్ సర్వీస్‌లో పాల్గొన్నారు. ప్రధాని మోదీ దేశ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ,, ఉత్తర భారత క్రైస్తవ సమాజం పెద్ద సంఖ్యలో హాజరైన ఈ కార్యక్రమంలో ప్రార్థనలు,, సాంప్రదాయ క్యారల్స్, హిమ్స్ లు నిర్వహించారు. ఢిల్లీ బిషప్ ఆర్‌టి. రెవ. డాక్టర్ పాల్ స్వరూప్ ప్రధాని మోదీ కోసం ప్రత్యేక ప్రార్థన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ,, ‘ఢిల్లీలోని కేథడ్రల్ చర్చ్ ఆఫ్ ది రిడంప్షన్‌లో క్రిస్మస్ మార్నింగ్ సర్వీస్‌లో పాల్గొన్నాను. ఈ సర్వీస్ ప్రేమ,,శాంతి,, కరుణమైయుడి సందేశాన్ని ప్రతిబింబిస్తుంది. క్రిస్మస్ స్ఫూర్తి మన సమాజంలో సామరస్యం,,మంచితనాన్ని ప్రేరేపించాలి’ అని తెలిపారు. ఈ పండుగ స్ఫూర్తి సమాజంలో ఐక్యతను బలోపేతం చేయాలని కోరారు. యేసు క్రీస్తు బోధనలైన ప్రేమ, శాంతి, కరుణలను జ్ఞాపకం చేస్తూ, సమాజంలో సామరస్యం, పరస్పర గౌరవాన్ని ప్రోత్సహించేలా ఈ కార్యక్రమం నిర్వహించారు. భారత వైవిధ్యభరిత మత సంప్రదాయాలకు గౌరవం చూపుతూ ఈ వేడుకలు జరిగాయని పేర్కొన్నారు.

