చైనాకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
అమరావతి: ఆదివారం టియాంజిన్లో ప్రారంభమయ్యే రెండు రోజుల షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జపాన్ పర్యటన ముంగించుకుని శనివారం మధ్యాహ్నం చైనా చేరుకున్నారు. టియాన్జియాన్ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి రెడ్ కార్పెట్ తో ఘన స్వాగతం పలికారు. ఓ దేశ ప్రధాని లేదా అధ్యక్షుడికి విమానాశ్రయంలో రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలకడం అరుదు. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత ప్రధాని మోదీ చైనాలో అడుగు పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
7 సంవత్సరాల తరువాత:- 2018 తర్వాత ప్రధాని మోడీ చైనాకు ఇది తొలి పర్యటన. గల్వాన్ లోయలో ఘర్షణల తర్వాత 2020లో క్షీణించిన భారతదేశం- చైనా మధ్య సంబంధాలను మెరుగుపరచడంలో ఆయన చైనా రాక మరో అడుగు పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధం, 50% సుంకం విధింపుతో న్యూఢిల్లీతో సహా వివిధ దేశాలు SCO – ప్రాంతీయ భద్రతా సమూహం-శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది.
అమెరికా చేస్తున్న సుంకాల బెదిరింపులపై:- రష్యా నాయకుడు వ్లాదిమిర్ పుతిన్, ఇతర నాయకులకు ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం చైనా, భారతదేశంపై అమెరికా చేస్తున్న సుంకాల యుద్ధానికి వ్యతిరేకంగా బల ప్రదర్శనగా ఉంటుంది. అయితే త్రైపాక్షిక సమావేశం ఉండదని వర్గాలు చెబుతున్నాయి. మోడీ-పుతిన్-జిన్పింగ్ ఒకే వేదికపై కన్పించనున్నారు.మోడీ-పుతిన్-జిన్పింగ్ మధ్య వన్-ఆన్-వన్ సమావేశంపై స్పష్టమైన వివరాలు తెలియరాలేదు.