ఒక దేశ సార్వభౌమాధాకారాన్ని గౌరవించ లేదంటే, విశ్వాసాన్ని కోల్పోవడమే-ప్రధాని మోదీ
అమరావతి: చైనాలోని తియాంజిన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సమావేశంలో పాల్గొనేందుకు చైనాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, చైనాకు పరోక్షంగా చురకలు అంటించారు.. చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు ఏ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే విధంగా ఉండరాదన్నారు.. దేశాల మధ్య నమ్మకాన్ని పెంచేదిలా ఉండాలన్నారు..
ఒకరి సార్వభౌమాధికారాన్ని మరొక సభ్యదేశం:- గ్లోబల్ నేతలను ఘనంగా స్వాగతించిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలియజేశారు..అనంతరం ప్రధాని మోదీ ఉపన్యాసిస్తూ, షాంఘై సహకార సంస్థ సదస్సులో ఉగ్రవాదం, సార్వభౌమాధికారం, పరస్పర సహకారం వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు.. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు పాటించవద్దని,, ఒక దేశ సార్వభౌమాధికారాన్ని మరొక సభ్యదేశం గౌరవించాలని సభ్య దేశాలను కోరారు.. భారదేశం గత 40 సంవత్సరాల నుంచి ఉగ్రవాద బాధిత దేశంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొందన్నారు..
పాకిస్తాన్ అక్రమిత కాశ్మీరు నుంచి:- ఒక దేశ సార్వభౌమాధాకారాన్ని గౌరవించ లేదంటే, విశ్వాసాన్ని కోల్పోవడమేనని ప్రధాని పరోక్షంగా పాకిస్తాన్ అక్రమిత కాశ్మీరు నుంచి వెళుతున్న పాకిస్థాన్,, చైనా కారిడాను ప్రస్తావిస్తూ అన్నారు.. బలమైన కనెక్టివిటీ వల్ల వాణిజ్యం పెరుగుతుందని,, పరస్పర విశ్వాసం పెరిగేందుకు ఈ చర్య దోహదపడుతుందని చెప్పారు.. దీనిని దృష్టిలో ఉంచుకునే చబహార్ పోర్ట్, ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్ కోసం తాము చొరవ తీసుకుంటున్నామని చెప్పారు.. ఇందువల్ల అఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఆసియాతో అనుసంధానం మెరుగవుతుందని తెలిపారు..
సివిలైజేషనల్ డైలాగ్ ఫోరం:- SCOలో భారతదేశం కీలక భూమిక పోషిస్తుందని ప్రధాని తెలిపారు..ఈ సందర్భంగా SCOSకు మోదీ కొత్త నిర్వచనం చెప్పారు. S-అంటే సెక్యూరిటీ, C-అంటే కనెక్టివిటీ, O-అంటే ఆపర్చునిటీ అని తెలిపారు.. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్ పోర్ట్ కారిడార్ ఏర్పాటు అవసరాన్ని తెలియచేస్తూ,, SCO కింద ‘సివిలైజేషనల్ డైలాగ్ ఫోరం’ ఏర్పాటును పరిశీలించాలని ప్రధాని మోదీ కోరారు.
ఉగ్రవాద వికృతరూపం పహల్గాం దాడి:- భారతదేశం 40 సంవత్సరాల నుంచి ఉగ్రవాదం కారణంగా ఎంతొ మంది అమాయక పౌరులు ప్రాణాలు కొల్నొయరని,,ఇటీవలనే ఉగ్రవాద వికృతరూపం పహల్గాంలో తాము చవిచూశామని ప్రధాని మోదీ చెప్పారు.. అలాంటి విషాద సమయంలో భారత్‌కు బాసటగా నిలిచిన మిత్రదేశాలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు.. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు ఆమోదయోగ్యం కాదనే విషయాన్ని సభ్యదేశాలు చాలాస్పష్టంగా, ఏకగ్రీవంగా ప్రకటించాల్సి ఉంటుందన్నారు.. పహల్గాం ఉగ్రదాడి మానవత్వాన్ని నమ్మే ప్రతి ఒక్కరికీ, ప్రతి ఒక్క దేశానికి బహిరంగ సవాలు వంటిదన్నారు.. కొన్ని దేశాలు బహిరంగంగా ఉగ్రదానికి మద్దతు పలుకుతున్నాయని,, అది మనకు ఆమోదయోగ్యమవుతుందా అనే ప్రశ్న తలెత్తడం సహజం అన్నారు.. మనమంతా ఏకగ్రీవంగా ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకించి,, మానవత్వం చాటు కోవడం మనకున్న బాధ్యత అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.