CRIMEMOVIESOTHERS

సల్మాన్‌,రూ.5 కోట్లు ఇవ్వాలి, లేదంటే ఇటీవల హత్యకు గురైన మాజీ ఎమ్మెల్యే సిద్ధిఖీ కంటే దారుణంగా

70 మంది,8 నెలలుగా రెక్కీ…

అమరావతి: బాలీవుడ్ హీరో సల్మాన్‌ ఖాన్‌ కు మరోసారి బెదిరింపులు వచ్చాయి.. హెచ్చరికతో కూడిన మెసేజ్‌లో…..ఈ “బెదిరింపులను తేలికగా తీసుకోవద్దు… సల్మాన్‌ ఖాన్‌ ఫ్రాణాలతో ఉండాలన్నా, బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని…ఇటీవల హత్యకు గురైన మాజీ ఎమ్మెల్యే సిద్ధిఖీ కంటే ఆయన దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది”… అని దుండగులు బెదిరించారు.. ముంబై ట్రాఫిక్‌ పోలీసుల వాట్సప్‌ నంబర్‌కు గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మెసేజ్‌ చేశారు.. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ నంబర్‌ ఎవరిది, మెసేజ్‌ ఎక్కడి నుంచి వచ్చిందని దర్యాప్తు ప్రారంభించారు..ఇదే సమయంలో దింతో బాంద్రాలోని సల్మాన్‌ ఖాన్‌ ఇంటివద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు..

కృష్ణ జింక కేసు:-  1998 సల్మాన్‌ ఖాన్‌,కృష్ణ జింకను వేటాడి చంపిన కేసు నుంచి, లారెన్స్ బిష్ణోయ్ గాంగ్‌ టార్గెట్‌ జాబితాలో టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు.. ఈ గ్యాంగ్‌ నుంచి సల్మాన్‌ అనేక సార్లు హత్య బెదిరింపులు ఎదుర్కొన్నాడు.. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో గెలాక్సీ అపార్ట్‌ మెంట్‌ వద్ద కాల్పుల ఘటన చోటు చేసుకుంది.. జూన్‌లో మరోసారి సల్మాన్‌, పన్వేల్‌ ఫామ్‌హౌస్‌ నుంచి ఇంటికి వెళ్తున్న మార్గంలో దాడి చేయాలని ఈ గ్యాంగ్‌ ప్లాన్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని గురువారం హర్యానాలోని పానిపట్‌లో అదుపులోకి తీసుకున్నారు.

ఛార్జ్‌ షీట్‌లో సంచలన విషయాలు:- ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి.. సల్మాన్‌ హత్యకు బిష్ణోయ్ గ్యాంగ్‌ పక్కా ప్లానింగ్‌తో వ్యవహరిస్తోందని పోలీసులు ఛార్జిషీట్‌లో ప్రస్తావించారు.. పంజాబీ సింగర్‌ సిద్ధూ మూసేవాలా హత్య తరహాలోనే కారులో సల్మాన్‌ను హత్య చేయాలని నిర్ణయించినట్లు పోలీసులు గుర్తించారు.. రూ.25 లక్షల ఒప్పందం ప్రకారం సల్మాన్‌ను హత్య చేయాలనుకున్నారని, ఆగస్ట్ 2023 నుంచి ఏప్రిల్ 2024 వరకు 8 నెలల పాటు ఈ హత్య ప్రణాళికను రూపొందించారని పోలీసులు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు..

సల్మాన్‌ హత్యకు, నిందితుల ముఠా AK-47, M16, AK-92 తుపాకులు,, హై-కాలిబర్‌ ఆయుధాలను వంటి అధునాతన మారణాయుధాలను పొరుగు దేశం పాకిస్థాన్ నుంచి కొనుగోలు చేయాలని భావించారని పోలీసులు పేర్కొన్నారు.. సల్మాన్‌ హత్య కుట్రలో భాగంగా అయన ఫామ్‌హౌస్‌ పరిసర ప్రాంతాలు, బాంద్రాలోని నివాసం సహా షూటింగ్‌ ప్రదేశాల్లో బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు చెందిన సుమారు 70 మంది రెక్కీ నిర్వహిస్తూ,, నటుడి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు విచారణలో వెల్లడి అయినట్లు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *