కొత్తగా ఉద్యొగం వచ్చిన వారికి నెల జీతం ముందే వారి బ్యాంకు ఖాతాలో-కేంద్ర క్యాబినెట్
కేంద్ర క్యాబినెట్ సమావేశంలో..
అమరావతి: దేశంలోని క్రీడాకారులను వెలుగులోకి తెచ్చేందుకు కేంద్ర క్యాబినెట్ కొత్త నేషనల్ స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం తెలిపింది.. మంగళవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. స్పోర్ట్స్ పాలసీ ద్వారా దేశంలో మౌలిక సదుపాయాలతో పాటు క్రీడాకారుల సమగ్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేయనుంది.. రీసెర్చ్ డెవలప్‌మెంట్ & ఇన్నోవేషన్ స్కీమ్‌కు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది..రూ.1 లక్ష కోట్లతో కార్పస్ ఫండ్‌తో దీన్ని ఏర్పాటు చేయనున్నారు.. దీని ద్వారా రీసెర్చ్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పించడమే ప్రధాన ఉద్దేశం..దీర్ఘకాలిక తక్కువ వడ్డీ లేదా వడ్డీ లేని రుణాలు అందించనున్నారు..తమిళనాడులో పరమాకుడి-రామనాథపురం మధ్య 4 వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి కేబినేట్ ఆమోదం తెలిపింది.. రూ.1,853 కోట్లతో 46.7 కిమీ మేర 4 వరుసలుగా రహదారి నిర్మించనుంది..
కొత్తగా జాబ్ వచ్చిన వారికి నెల జీతం ముందే వారి బ్యాంకు ఖాతాలో పడుతుంది..దిన్నే (ELI) ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటారు..ఈ స్కీమ్ కోసం రూ.1.07 లక్షల కోట్లు నిధులను కేంద్రం కేటాయించింది..ఈ పథకం ద్వారా దేశంలోని యువతకు ఉద్యోగాలు లభిస్తాయి..ఉపాధి ఆధారిత ప్రోత్సాహకం పథకంతో యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించడం,,ప్రైవేట్ కంపెనీలు ఎక్కువ మంది కార్మికులను నియమించుకునేలా ప్రోత్సహించడం ఈ పథకం ముఖ్య లక్ష్యాలు..ఈ స్కీమ్ 5 సంవత్సరాలు అమల్లో ఉంటుంది..మొదటిసారి ఉద్యోగం చేసే వారికి సాయం చేస్తుంది..నెల జీతం ముందే వేస్తుంది.. కొత్త ఉద్యోగాలు సృష్టించే యజమానులకు ప్రోత్సాహకాలు ఇస్తుంది..తయారీ రంగంలో ఉద్యోగాల కల్పనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది..దేశవ్యాప్తంగా రాబోయే రెండేళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కేంద్రం చర్యలు చేపట్టింది.. 2025 ఆగస్టు 1వ తేదీ నుంచి 2027 జూలై 31 మధ్య ఉద్యోగంలో చేరే వారికి ఈ పథకాన్ని కేంద్రం వర్తింపజేయనున్నదని అధికారవర్గాలు పేర్కొన్నాయి.