జులై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
అమరావతి: జులై 21 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు బుధవారం ప్రకటించారు.. ఈ సమావేశాల్లో పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై చర్చించనున్నట్లు సమాచారం..23 రోజుల పాటూ జరిగే ఈ సమావేశాల్లో కీలకమైన బిల్లులను కూడా కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.. జాతీయ భద్రత, ఆర్థిక స్థితిగతులపై కూడా చర్చించే అవకాశం ఉన్నాయి.

