రాష్ట్రపతి చేతుల మీదుగా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు అందుకున్న మంత్రి నారాయణ
ఐదు మున్సిపల్ కార్పొరేషన్ లకు అవార్డులు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా మార్చాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని పురపాలక,పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ.ముఖ్యమంత్రి అన్నారు.. నిరంతర పర్యవేక్షణతోనే రాష్ట్రంలోని మున్సిపాల్టీలు మరోసారి స్వచ్చత అవార్డులు దక్కించుకున్నాయన్నారు..గురువారం ఢిల్లీలోని విజ్జాన భవన్ లో స్వచ్చ సర్వేక్షణ్ 2024-2025 అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది…ఈ కార్యక్రమానికి గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిధిగా హాజరయ్యారు…ఈ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్, వివిధ రాష్ట్రాల పట్టణాభివృద్ది శాఖ మంత్రులు,అధికారులు హాజరయ్యారు..ఈసారి ఆంధ్రప్రదేశ్ లోని 5 మున్సిపల్ కార్పొరేషన్ లు వివిధ కేటగిరీల్లో స్వచ్చ సర్వేక్షణ్ అవార్డులు దక్కించుకున్నాయి..ఆయా కార్పొరేషన్ల అధికారులతో కలిసి మంత్రి నారాయణ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు..
మూడు మున్సిపాల్టీలు ఆంధ్రప్రదేశ్ నుంచే:- దేశం మొత్తం మీద కేవలం 23 మున్సిపాల్టీలు మాత్రమే స్వచ్చ సూపర్ లీగ్ అవార్డులు దక్కించుకోగా వాటిలో మూడు మున్సిపాల్టీలు ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నాయి. 10 లక్షల జనాభా దాటిన నగరాల్లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, 3 లక్షల నుంచి 10 లక్షల జనాభా కలిగిన నగరాల్లో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్, 50 వేల నుంచి 3 లక్షల జనాభా కలిగిన కేటగిరీలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ లు స్వచ్చ సూపర్ లీగ్ అవార్డులు దక్కించుకున్నాయి..
మినిస్టీరియల్ అవార్డు స్పెషల్ కేటగిరీలో సఫాయి మిత్ర సురక్షిత నగరాల్లో గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ప్రథమ స్థానంలో నిలిచింది…మినిస్టీరియల్ అవార్డుల్లో రాష్ట్ర స్థాయిలో రాజమండ్రి మునిసిపల్ కార్పొరేషన్ల్ అవార్డు దక్కించుకుంది.
అధికారులు,పారిశుద్య సిబ్బంది:- ఆంధ్రప్రదేశ్ కు స్వచ్చ సర్వేక్షణ్ అవార్డులు రావడం మున్సిపల్ శాఖ పనితీరుకు నిదర్శనమని,,రాష్ట్రానికి ఎంతో గర్వకారణం అని మంత్రి నారాయణ అన్నారు. .అవార్డులు రావడానికి కారణమైన అధికారులు,పారిశుద్య సిబ్బందిని మంత్రి అభినందించారు. భవిష్యత్తులో అన్ని మునిసిపాలిటీలు పోటీతత్వంతో పనిచేసి మరిన్ని అవార్డులు దక్కించుకునేందుకు కృషి చేయాలని సూచించారు…