మెక్సీకోలో మాఫియా కింగ్ హతం-చేలరేగిన ఆల్లర్లు
అమరావతి: మెక్సీకోలో మాదక ద్రవ్యల ఆక్రమ వ్యాపారంతో వేల కోట్లకు పడగలేత్తని, నెమెసియో రూబెన్ ఒసెగెరా సర్వాంటెస్(ఎల్ మెన్చో) అనే మాఫియా కింగ్ ను ఆదివారం హలిస్కో రాష్ట్రంలోని తపాల్పా ప్రాంతంలో ఆదివారం భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఎల్ మెంచో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం అతడిని మెక్సికో నగరానికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశాడు. ఘటనా స్థలంలో నలుగురు మరణించగా మరో ఇద్దరిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. డ్రగ్స్ ముఠా సభ్యుల నుంచి వాహనాలు, రాకెట్ లాంచర్లు, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.
పలు రాష్ట్రాల్లో హింస:- మెక్సీకో ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్‌లో ఎల్ మెన్చో హతం అయ్యాడని వార్త రావడంతో, గంటల్లోనే అతడి ముఠాకు చెందిన సాయుధులు వాహనాలను తగలబెట్టి హైవేలు మూసేశారు. భద్రతా బలగాలతో ఘర్షణలకు దిగుతున్నారు. పలు రాష్ట్రాల్లో హింస చెలరేగుతోంది. ఎల్ మెన్చో చనిపోయాక కూడా మెక్సికో మంటల్లో కాలుతోంది. మెక్సికోలోని తమ పౌరులకు పలు దేశాలు హెచ్చరికలు జారీ చేశాయి. అప్రమత్తంగా ఉండాలని, షెల్టర్లలోకి వెళ్లిపోవాలని కోరాయి.
ముఠా సభ్యులు ఒక ఎయిర్‌పోర్టులోకి కూడా చొరబడి అరాచకం సృష్టించడంతో ప్రయాణికులు భయంతో పారిపోయారు. భారీ పొక్లెయిన్లతో అల్లరి మూకలు రోడ్లను తవ్వుతున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బమ్ తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
అతడి తలపై రూ.136 కోట్ల రివార్డు:- మెక్సికోలో ఎల్ మెన్చో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారాడు. అమెరికాకు డ్రగ్స్ రవాణాదారుగా ఎల్ మెన్చో ఎదిగాడు. అతడి (డగ్స్ సరాఫరా చేసే ముఠాలను కార్టెల్ అంటారు) జాలిస్కో కార్టెల్‌ను అమెరికా ఉగ్ర సంస్థగా ప్రకటించి, అతడి తలపై రూ.136 కోట్ల రివార్డు ప్రకటించింది.

