ఫ్లెమింగో ఫెస్టివల్ 2025ను ప్రారంభించిన మంత్రి దుర్గేష్
సూళ్లూరుపేట: ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 పక్షుల పండుగ కార్యక్రమాన్ని అట్టహాసంగా హోలీ క్రాస్ సర్కిల్ నుంచి ర్యాలీగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక,సినిమాటోగ్రఫీ శాఖమంత్రి కందుల.దుర్గేష్, స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ లు శనివారం ప్రారంభించారు.. క్రాస్ సర్కిల్ సెంటర్ నుంచి అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొని పలు కళారూపాల విన్యాసాల ప్రదర్శనతో, మేళ తాళాల నడుమ ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కార్యక్రమం జరగనున్న జూనియర్ కళాశాల ప్రాంగణానికి చేరుకున్నారు..ఈకార్యక్రమంలో జెసి శుభం బన్సల్, ఆర్డీ టూరిజం రమణ ప్రసాద్,,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 సందర్భముగా వివిధ శాఖలకు చెందిన ఎగ్జిబిషన్ స్టాల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్, మెడికల్ క్యాంప్, హార్టికల్చర్, అగ్రికల్చర్, అటవీ శాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ తిరుపతి, ఆప్కో, చేనేత, హ్యాండీక్రాఫ్ట్స్ కలంకారి, ఐసిడిఎస్ అంగన్వాడి కేంద్రాలు, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, శిల్పారామం, షార్ అంతరిక్ష కేంద్రం నమూనా స్టాల్, శ్రీ సిటీ పరిశ్రమలకు సంబంధించిన స్టాల్, స్టేట్ బ్యాంక్,,అనుబంధ సంస్థ బ్యాంకులు, పర్యాటకశాఖ వారి ఫుడ్ కోర్టులు,, వీనస్ వారి ఉచిత వైద్య శిబిరం తదితర స్టాల్స్ ను మంత్రి ప్రారంభించారు.