NATIONALOTHERSWORLD

ఇజ్రాయెల్‌, అమెరికాల దాడుల్లో,ఇరాన్‌ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ మృతి

హిజాబ్ లేకుండా వీధుల్లో నృత్యాలు..

అమరావతి: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికాలు ప్రారంభించిన దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ మృతి చెందినట్లు ఇరాన్‌ అధికారిక మీడియా ధ్రృవీకరించింది. ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కుమార్తె, అల్లుడు, కోడలు, మనవరాలు మరణించనట్లు వివరాలను వెల్లడించింది.

ఇజ్రాయెల్,అమెరికా దళాలు ఖమేనీ నివాసంపై ఆధునిక క్షిపణులతో విరుచుకుపడ్డాయి. దాదాపు 30 క్షిపణులను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. దింతో ఖమేనితోపాటు ఖమేనీ కుమార్తె, అల్లుడు, మనమరాలు మృతిచెందినట్లు ఇరాన్ మీడియా ధ్రువీకరించింది. ఇజ్రాయెల్ ప్రభుత్వ రంగ సంస్థ కాన్, ప్రముఖ ఛానెల్ 12 వెల్లడించిన వివరాల మేరకు,, టెహ్రాన్ లోని ఖమేనీ నివాసంపై జరిగిన భారీ బాంబు దాడిలో ఖమేనీ మరణించారు. దాడి జరిగిన కొన్ని గంటల తరువాత నివాస శిథిలాల నుంచి ఆయన మృతదేహాన్ని వెలికితీసినట్లు సమాచారం.

హిజాబ్ లేకుండా వీధుల్లో నృత్యాలు:- ఖమేనీ మృతదేహాన్ని వెలికితీసి దానికి సంబంధించిన ఫొటో అధారాలను ట్రంప్, నెతన్యాహులకు పంపారని ఇజ్రాయెల్ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో 40 రోజులు సంతాప దినాలను ప్రకటించింది. మరోవైపు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో ఇరాన్‌లో ఆందోళనకారులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఇరాన్‌లోని పలు నగరాల్లో ప్రజలు ఈలలు వేస్తూ, కేరింతలు కొడుతున్న దృశ్యాలు అంతర్జాతీయ మీడియాలో ప్రసారం అయ్యాయి. ఇస్లామిక్ రిపబ్లిక్ అంతం కావాలనే నినాదాలతో వీధులు మార్మోగినట్లు రిపోర్టు చేశాయి. ఇరాన్ శివారు ప్రాంతమైన బైసత్ టౌన్‌లో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఈ వీడియోను ఫాక్స్ న్యూస్ పోస్టు చేసింది. ఖమేనీ మరణ వార్త తెలియగానే ఇరాన్ మహిళలు హిజాబ్ లేకుండా వీధుల్లో నృత్యాలు చేస్తున్నారని ఇజ్రాయెల్ మాజీ అధికార ప్రతినిధి ఎలాన్ లేవీ ఒక వీడియోను పంచుకున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *