ప్రపంచ దేశాలకు భారతదేశ ఆర్దిక వ్యవస్థ చుక్కాని-ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
అమరావతి: ప్రపంచ దేశాలకు వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశ ఆర్దిక వ్యవస్థ చుక్కానిలాగా పనిచేస్తుందని,, త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు..టోక్యోలో ఇండియా-జపాన్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొని ప్రసంగించారు.. ప్రపంచం అంతా భారత్‌పైనే ఆశలు పెట్టుకుందని,, విదేశీ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టడం పెరిగిందని అన్నారు.. పెట్టుబడులు కేవలం పెరగడమే కాకుండా రెట్టింపు అవుతున్నాయని చెప్పారు..
అనేక రంగాల్లో జపాన్ తోడ్పాటు:- ఈ సందర్భంగా భారత్-జపాన్ భాగస్వామ్యాన్ని ప్రధాని మోదీ ప్రస్తావిస్తూ, భారత్ అభివృద్ధిలో జపాన్ కీలక భాగస్వామి అని అన్నారు.. ‘ప్రపంచం కేవలం భారతదేశాన్ని మాత్రమే చూడటంమే కాదు,,భారత్‌పై ఆశలు పెట్టుకుందన్నారు.. మెట్రో రైళ్ల నుంచి సెమీకండక్టర్లు, స్టార్టప్‌లు ఇలా అనేక రంగాల్లో జపాన్ తోడ్పాటు అందించిందన్నారు.. జపాన్ సంస్థలు భారత్‌లో 40 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టాయి’ తెలిపారు..భారత్‌లో ఆర్థిక, రాజకీయ స్థిరత్వం నెలకొందని ఈ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు.
700 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు:- ప్రభుత్వ పరంగా పారదర్శకమైన విధానాలను అవలంభిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు..భారత్ మార్కెట్లు భారీ రాబడిని అందిస్తున్నాయని,, తమకు బలమైన బ్యాంకింగ్ రంగం,, 700 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. అణుశక్తి, గ్రీన్ ఎనర్జీ, ఆటోసెక్టార్‌లో రెండు దేశాలు మరింత కలిసికట్టుగా పనిచేయాలని మోదీ సూచించారు.