NATIONALWORLD

భారతదేశం “ప్రజాస్వామ్యానికి తల్లి”లాంటిది-ప్రధాని మోదీ

ఘనాదేశం యొక్క అత్యున్నత పురస్కారం..

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 8 రోజుల పాటు విదేశా పర్యాటనల్లో పాల్గొనున్నారు..ఇందులో ఘనా, ట్రినిడాడ్‌-టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాల పర్యటిస్తారు..ఇందులో భాగంగా రెండు రోజుల పర్యటనలో బాగంగా పశ్చిమ ఆఫ్రికా దేశమైన ఘనాలో పర్యటిస్తున్నారు..30 సంవత్సరాల తరువాత ఆ దేశంలో భారత ప్రధాన మంత్రి పర్యటించడం ఇదే తొలిసారి..

ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి, ఘనాదేశం యొక్క అత్యున్నత పురస్కారం ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా” అవార్డు అందచేశారు..ఈ సందర్బంలో ప్రధాని మోదీ గురువారం ఘనా పార్లమెంటును ఉద్దేశించి ఇంగ్లీషులో ప్రసంగించారు.. భారతదేశాన్ని “ప్రజాస్వామ్యానికి తల్లి”గా ప్రధాని మోదీ అభివర్ణించారు.. ప్రజాస్వామ్య వ్యవస్థలో భావ వ్యక్తీకరణ, చర్చల ప్రాముఖ్యతను వివరించారు..భారతదేశంలో 2,500 కి పైగా రాజకీయ పార్టీలు ఉన్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నప్పుడు ఘనా పార్లమెంట్‌లో అందరూ ఆశ్చర్యంతో చిరునవ్వులు చిందించారు..

ఈ సభను ఉద్దేశించి ప్రసంగించటం నా భాగ్యంగా భావిస్తున్నాను.. ప్రజాస్వామ్య ఆత్మను వెలుగించే ఘనా నేలపై ఉండటం నాకు దక్కుతున్న గొప్ప గౌరవం.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ తరఫున, 140 కోట్ల భారతీయుల తరఫున ఘనాకు ప్రేమతో వచ్చాను” అన్నారు..భారత్ త్వరలో ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది..‘వన్ వరల్డ్, వన్ సన్, వన్ గ్రిడ్’, ‘వన్ వరల్డ్, వన్ హెల్త్’ వంటి గ్లోబల్ కార్యక్రమాలకు ఇది బలమిస్తోంది. అంతర్జాతీయ సౌర అలయెన్స్ ద్వారా సౌర శక్తి, స్థిరత్వం కోసం పనిచేస్తున్నామన్నారు..

భారత ప్రజలు వరుసగా 3సార్లు ఒకే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు:- 2025 సెప్టెంబర్‌లో ఘనా, ఆఫ్రికా ప్రాంతీయ అంతర్జాతీయ సౌర అలయెన్స్ సమావేశానికి ఆతిథ్యం ఇస్తుండటం సంతోషకరమైన విషయం అన్నారు..ప్రపంచం ఒక కుటుంబం అనే మన సంస్కృతిని ఇది స్పష్టంగా చూపుతోంది.. గత దశాబ్దంలో భారత్‌లో పెద్ద మార్పు జరిగింది.. భారత ప్రజలు శాంతి, భద్రత, అభివృద్ధిపై విశ్వాసం చూపించారు తెలిపారు..భారత ప్రజలు వరుసగా 3సార్లు ఒకే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు… ఆరు దశాబ్దాల తర్వాత ఇది సాధ్యమైంది..ఇప్పుడు భారత్‌లో స్థిరమైన పాలన, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ఉంది..ప్రస్తుతం ప్రపంచ వృద్ధిలో భారత్ వాటా సుమారు 16 శాతం ఉంది అని ప్రధాని మోదీ  వెల్లడించారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *