BUSINESSNATIONALOTHERS

భారత్, బ్రెజిల్ దేశాలు కలిసి పనిచేస్తే ‘గ్లోబల్ సౌత్’ మరింత బలోపేతం-ప్రధాని మోదీ

అమరావతి: భారత-బ్రెజిల్ దేశాల ప్రయోజనాలు దృష్టిలో వుంచుకుని ఉభయతారకంగా పని చేసేందుకు సిద్దం కావడాని ప్రశంసిస్తూ, రెండు దేశాలు అన్ని రంగాలలో తమ సంబంధాన్ని పెంపొందించుకోవడానికి అంకితభావంతో ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. శనివారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రతినిధి బృందం స్థాయి చర్చల తర్వాత బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వాతో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ బ్రెజిల్  అధ్యక్షుడు లూలా “దార్శనిక-స్ఫూర్తిదాయక” నాయకత్వంలో భారతదేశం-బ్రెజిల్ సంబంధాలు సంవత్సరాలుగా చాలా ప్రయోజనం పొందాయని తెలిపారు.భారతదేశం పట్ల ఆయన లోతైన స్నేహం,నమ్మకాన్ని చూపారని అన్నారు.రాబోయే 5 సంవత్సరాల్లో ఇరు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $20 బిలియన్లకు పైగా పెంచడానికి కట్టుబడి ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఇరు దేశాల భవిష్యత్‌ కోసం డిజిటల్‌ పార్ట్‌ నర్‌షిప్‌, రేర్‌ఎర్త్‌ అండ్‌ క్రిటికల్‌ మినరల్స్‌, స్టీల్‌ సరఫరా గొలుసులో మైనింగ్‌ రంగాల్లో పరస్పర సహకారానికి సంబంధించి మూడు ఒప్పందాలపై వారిద్దరు సంతకాలు చేశారు.

లులా ద సిల్వా రాక పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేస్తూ “అధ్యక్షుడు లులాకు, ఆయనతో వచ్చిన ప్రతినిధుల బృందానికి స్వాగతం పలకడం చాలా ఆనందంగా ఉంది” అని ప్రధాని మోదీ అన్నారు. లులా దార్శనికత, నాయకత్వంలో ఇరు దేశాల సంబంధాలు ఎంతో బలపడ్డాయని కొనియాడారు. గత కొన్నేళ్లలో లులాను తాను పలుమార్లు కలిశానని మోదీ గుర్తు చేసుకున్నారు. ప్రతి కలయికలోనూ భారత్‌పై ఆయనకు ఉన్న నమ్మకం, గొప్ప స్నేహభావం తనకు కనిపించాయన్నారు. ప్రస్తుతం భారత్‌లో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ‘గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌’లో లులా పాల్గొన్నందుకు, ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. లులా పర్యటన ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త శక్తిని ఇచ్చిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *