NATIONAL

దేశం కంటే ఏది ముఖ్యం కాదన్న అయన గుండెధైర్యం యువతరానికి ప్రేరణ-ప్రధాని మోదీ

మన్ కీ బాత్” 126వ ఎపిసోడ్..

అమరావతి: అమరవీరుడు భగత్ సింగ్ దేశ యువతకు స్ఫూర్తిదాయకమని,, ఉరితీయడానికి ముందు, తనను యుద్ధ ఖైదీగా పరిగణించాలని, తనను, తన సహచరులను కాల్చి చంపాలని బ్రిటిష్ వారికి లేఖ రాశారని దేశం కంటే ఏది ముఖ్యం కాదన్న అయన గుండెధైర్యం యువతరానికి ప్రేరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు..ఆదివారం ప్రదాని రేడియో కార్యక్రమం “మన్ కీ బాత్” 126వ ఎపిసోడ్ ద్వారా జాతినుద్దేశించి ప్రసంగించారు.. గొప్ప విప్లవకారుడు భగత్ సింగ్,, దిగ్గజ గాయని లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా వారిని ఆయన స్మరించుకున్నారు..

యువతరానికి ప్రేరణ:- భగత్ సింగ్ మానవత్వం,,దేశ ప్రజల పట్ల సున్నితత్వాన్ని అయన జయంతి సందర్బంగా ప్రధాని అమరవీరుడిని స్మరించుకున్నారు..ప్రముఖ గాయని లతా మంగేష్కర్ జయంతి సందర్భంను గుర్తు చేసుకుంటు,, లతా దీదీ పాటలు ప్రతి ఒక్కరి హృదయాలను తాకాయని, ముఖ్యంగా ఆమె దేశభక్తి గీతాలు ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేశాయన్నారు..

నావికాదళానికి చెందిన ఇద్దరు:- నావికా సాగర్ పరిక్రమ సందర్భంగా భారత నావికాదళానికి చెందిన ఇద్దరు ధైర్యవంతులైన అధికారులు పరాక్రమాన్ని,, దృఢ సంకల్పాన్ని ప్రదర్శించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు..ఈ ఇద్దరు ధైర్యవంతులైన అధికారులను “:మన్ కీ బాత్”  శ్రోతలకు పరిచయం చేయాలనుకుంటున్నాను అని,,అందులో ఒకరు లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా,, మరొకరు లెఫ్టినెంట్ కమాండర్ రూపా పేర్లను ప్రధాని మోదీ వెల్లడించారు..

RSS నిస్వార్థ సేవ:- రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) 100వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోడీ ఆ సంస్థ ప్రయాణాన్ని ప్రశంసిస్తూ “అద్భుతమైనది,, అపూర్వమైనది,, స్ఫూర్తిదాయకం” అని ఆయన అభివర్ణించారు.. RSS నిస్వార్థ సేవ,, క్రమశిక్షణను ప్రశంసించారు.. దేశం ముందు అనే స్ఫూర్తి RSS స్వచ్ఛంద సేవకులలో ఎల్లప్పుడూ అత్యంత ప్రధానమైనదని మోదీ అన్నారు.

స్వదేశీ, స్థానిక ఉత్పత్తులను:- రాబోయే పండుగల సీజన్‌లో స్వదేశీ, స్థానిక ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలని ప్రధాని మోదీ దేశ ప్రజలను కోరారు.. ఇది సాంప్రదాయ పరిశ్రమలకు మద్దతు ఇవ్వడమే కాకుండా ఈ ఉత్పత్తులను తయారు చేసే కుటుంబాలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుస్తుందన్నారు..ఇది దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా స్వదేశీ ఉత్పత్తులకు మద్దతు ఇవ్వడం ద్వారా భారతదేశాన్ని నిజంగా స్వావలంబన చేయడానికి మార్గమని అన్నారు.

ఖాదీ ఉత్పత్తిని కొనుగోలు చేయాలి:- దేశ పౌరులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు..ఛఠ్ మహాపర్వాన్ని యునెస్కో అగోచర సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చడానికి భారత ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.. గత 11 సంవత్సరాలలో, ఖాదీ పట్ల దేశ ఆకర్షణ గణనీయంగా పెరగడంతో అమ్మకాలు భారీగా పెరిగాయన్నారు.. అక్టోబర్ 2న మీరందరూ ఖాదీ ఉత్పత్తిని కొనుగోలు చేయాలని కోరుతున్నా,,ఇవి స్వదేశీ వస్తువులని గర్వంగా ప్రకటించండని కోరారు..అస్సామీ గాయకుడు జుబిన్ గార్గ్ జ్ఞాపకం ప్రఖ్యాత అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్‌ను కూడా ప్రధాని గుర్తు చేసుకున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *