హర్యానా అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆత్మహత్య
అమరావతి: హర్యానా అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADGP) వై. పూరన్ కుమార్, మంగళవారం ఆయన చండీగఢ్‌లోని తన ఇంట్లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తొంది.సమాచారం అందుకున్న పోలీసు, ఫారెన్సిక్ బృందాలు ఇప్పటికే ADGP ఇంటికి చేరుకుని, సంఘటనపై దర్యాప్తు ప్రారంభించాయి.
సూసైడ్ నోట్:- మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో సెక్టర్ 11 పోలీస్ స్టేషన్ సిబ్బందికి సమాచారం అందిందని చండీగఢ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు కన్వర్‌దీప్ కౌర్ తెలిపారు.‘IPS అధికారి వై పూరన్ కుమార్ మృత దేహం ఆయన ఇంట్లో లభించింది. CFSL (సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ) బృందం ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ కోసం శోధిస్తొంది. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని తెలిపారు. పోస్టుమార్టం వచ్చన తరువాత ఆసలు విషయాలు వస్తాయని పేర్కొన్నారు.
పూరన్ కుమార్ భార్య..IAS:- పూరన్ కుమార్ భార్య అమ్నీత్ పీ కుమార్ సీనియర్ IAS అధికారిణి. సంఘటన జరిగిన సమయంలో ఆమె హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ నేతృత్వంలో జపాన్ పర్యటనలో ఉన్నారు. హర్యానా కేడర్‌కు చెందిన పూరన్ కుమార్‌కు మంచి పేరుంది. తన కెరీర్‌లో ఆయన అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు.