BUSINESSNATIONALOTHERSWORLD

భారత్,బ్రిటన్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

అమరావతి: భారతదేశం-బ్రిటన్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు జరిగింది.. ఈ ఒప్పందంతో రెండు దేశా మధ్య ఉన్న ఆర్థిక సంబంధాలు,, 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 120 బిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యంగా ఇరు దేశాలు ముందడుగు వేశాయి.. గురువారం లండన్‌లో జరిగిన కార్యక్రమంలో భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్,, బ్రిటన్ ట్రేడ్ మినిస్టర్ జోనథన్ రేనోల్డ్స్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు..ఈ చారిత్రక ఒప్పందం ప్రధాని నరేంద్ర మోదీ,, బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్‌లు సమక్షంలో జరిగాయి..

ప్పందం వల్ల రైతులకు ఎగుమతి అవకాశలు పెరగనున్నాయి.. బ్రిటన్ మార్కెట్‌లోకి, భారతీయ వ్యవసాయ ఉత్పత్తుల (పండ్లు, కూరగాయలు, మసాలాలు, ధాన్యాలు) అందుబాటులోకి వస్తాయి..ఆర్గానిక్ ఉత్పత్తులపై బ్రిటన్ వినియోగదారుల్లో ఆసక్తి ఎక్కువ ఉండటం కారణంగా,,సదరు పంటలు పండించే మనదేవంలోని రైతులకు ఎక్కువ ధరలు లభించే అవకాశం ఉంటుంది.. ఎగుమతులపై సుంకాల్లో తగ్గింపు వల్ల మధ్యవర్తులు తగ్గి రైతులకు నేరుగా లాభం చేకూరుతుంది.. భారత రైతులకు గ్లోబల్ మార్కెట్ చేరువ కావడంతో పంటలకు అంతర్జాతీయ విలువ ఉంటుంది..

ఐటీ, టెక్స్‌ టైల్‌, ఫార్మా, ఆటోమొబైల్:- ఈ ఒప్పందం కారణంగా ఇంకా రెండు దేశాల మధ్య దిగుమతి, ఎగుమతులపై సుంకాలు తగ్గుతాయి..ఇన్‌వెస్ట్‌ మెంట్, ఉద్యోగ అవకాశాలు పెరుగుదలకు మంచి అవకాశాలు ఉంటాయి.. భారత ఐటీ, టెక్స్‌ టైల్‌, ఫార్మా, ఆటోమొబైల్ రంగాలకు భారీ ప్రోత్సాహం వస్తుంది.. బ్రిటన్‌లో భారతీయ విద్యార్థులు, స్టార్టప్‌లకు అవకాశలు పెరుగుతాయి..అలాగే భారతీయ MSMEలు బ్రిటన్‌లో ఎంట్రీకి మార్గం సుగుమం అవుతుంది..

బ్రెగ్జిట్ తరువాత బ్రిటన్:- ఈ ఒప్పందం కేవలం ఆర్థిక పరంగా కాకుండా,, భారత్ గ్లోబల్ ట్రేడ్ పొజిషన్‌ను మరింత బలపరిచే సూచికగా విశ్లేషకులు భావిస్తున్నారు..యురోపియన్ యూనియన్ నుంచి బ్రెగ్జిట్ తరువాత బ్రిటన్ కుదుర్చుకున్న అత్యంత కీలక ఒప్పందాల్లో ఇది ఒకటిగా నిలుస్తొంది.. ఈ అగ్రిమెంట్‌తో  బ్రిటన్‌, భారత్‌ భాగస్వామ్యంతో కొత్త అధ్యాయం మొదలవుతుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యనించారు.. భద్రత, రక్షణ, ఏఐ, విద్య తదితర రంగాల్లో బ్రిటన్‌, భారత్‌ కొత్తపుంతలు తొక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేశాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *