జార్ఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం-18 కన్వరియాల భక్తులు మృతి
అమరావతి: జార్ఖండ్లో మంగళవారం వేకువజామున 4.30 నిమిషాల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.. కన్వరియాల భక్తులతో వెళ్తున్న బస్సు,, గ్యాస్ సిలిండర్ల లోడ్ తో వెళ్లుతున్న లారీని దేవఘర్ వద్ద ఢీకొనడంతో ప్రమాదం జరిగింది..ఈ ప్రమాదంలో దాదాపు 18 మంది మృతిచెందారని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే వెల్లడించారు..దుమ్కా జోన్ ఐజీ శైలేంద్ర కుమార్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ,, 32 సీట్లు ఉన్న బస్సులో కన్వరియాలు వెళ్తున్నట్లు తెలిపారు..మోహన్పురా పోలీసు స్టేషన్ పరిధిలోని జామునియా అటవీ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందన్నారు..ప్రమాదంలో కనీసం 9 మంది మృతిచెందారని, గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు..మృతిచెందిన వారి ఐడెంటిటీ ఇంకా వెల్లడించలేదు.. ప్రమాదంలో కనీసం 20 మంది యాత్రికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం.

