ధర్మస్థలపై అబద్దాల ఆరోపణలు-పారిశుద్ధ్య కార్మికుడి భీమా అరెస్ట్
సనాతధర్మం అంటే నచ్చని…
దేశంలోని సూడో సెక్యురిస్టులు,,కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రంమైన ధర్మస్థల పేరును,,ట్రస్టీలను భ్రష్టు పట్టించేందుకు 100కు పైగా శవాలు అనే conceptతొ ,,పారిశుద్ధ్య కార్మికుడి పేరుతో అడించిన నీచమైన నాటకం బట్టబయలు అయింది..ఈ సూడో సెక్యురిస్టులు ఇతర మతాల జోలికి పోరు..వీళ్లకు హిందు మతం అంటేను చులకన?? ఇప్పటి వరకు సోషల్ మీడియాలో రకరకాల కథనలు,,వీడియోలు చూపించిన సనాతన ధర్మ వ్యతిరేకులు ఎక్కడి పోయారు?? ఇలాంటి వారిని చట్టం కఠినంగా శిక్షించాలి..
అమరావతి: ధర్మస్థల ఆలయ పరిసరాల్లో సుమారు 100కు పైగా మృతదేహాలను ఖననం చేశానంటూ భీమా అనే పారిశుద్ధ్య కార్మికుడి దాదాపు ఆరు వారాల నుంచి ఆడుతున్న నాటకానికి సిట్ బృందం తెరదించింది..సమాజంలో అనుమానుల రేకేత్తించి,, విచారణలో పొంతన లేని సమాధానలు చెపుతూ వచ్చిన భీమా,, చివరకి తనకు ఏమీ తెలియదని చేతులు ఎత్తేశాడు..దీంతో డీఐజీ ప్రణబ్ మహంతి నేతృత్వంలోని సిట్ బృందం పారిశుద్ధ్య కార్మికుడు భీమాను అదుపులోకి తీసుకుంది..ఇలాంటి నాటకం ఆడటానికి కారణాలేంటని రాబట్టేందుకు సిట్ ప్రయత్నాలు మొదలుపెట్టింది..విచారణ అనంతరం భీమాను కోర్టులో హాజరు పరచనున్నారు.
సుజాత భట్ కుమారై పేరిట అబద్దాలు:- బీమా 100కు పైగా శవాలు అంటూ కోర్టుకు ముసుగు వేసుకుని వచ్చి,,కొన్ని ఫోటోలను చూపించి దారుణమైన ఆరోపణలు ధర్మస్థలపై చేశాడు..రోజుల వ్యవధిలోని బెంగళూరుకు చెందిన సుజాత భట్, తన కుమార్తె అనన్య భట్ 2003లో ధర్మస్థలలో అదృశ్యమైందని ఫిర్యాదు చేసింది..కథ అడ్డం తిరిగి నిజాలు బయటకు వస్తున్న నేపధ్యంలో ఆమె గతంలో తాను చేసిన ఆరోపణలు,,నేను చేయలేదంటూ తిరస్కరించింది.. దీంతో సుజాతను కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి..
100కు పైగా మహిళలు, పిల్లలు:- ధర్మస్థల శైవ క్షేత్రంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన భీమా అనే వ్యక్తి కొన్నాళ్ల క్రితం సంచలన ఆరోపణలు చేశాడు. 1995 నుంచి 2014 మధ్య లైంగిక వేధింపులకు గురై హత్య చేయబడ్డ 100కు పైగా మహిళలు, పిల్లల మృతదేహాలను తాను పూడ్చిపెట్టానని..2014లో తమ కుటుంబంలోని ఓ యువతిని లైంగికంగా వేధించి హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడం దేశవ్యాప్తంగా కలకలం చెలరేగింది.. పశ్చాతాపం వెంటాడుతుండటంతోనే ఈ ఫిర్యాదు చేసినట్లు భీమా వివరణ ఇచ్చుకున్నాడు..కర్ణాటలక ప్రభుత్వం దర్యాప్తు కోసం ప్రణబ్ మహంతి నేతృత్వంలోని సిట్ బృందాన్ని రంగంలోకి దింపింది.. భీమా చెప్పిన ప్రకారం పలు చోట్ల సిట్ అధికారులు తవ్వకాలు జరిపారు. కేవలం రెండు ప్రదేశాల్లోనే కొన్ని ఎముకలు కనిపించాయి..
100కు పైగా శవాలు ఎక్కడ అన్న పోలీసుల ప్రశ్నకు భీమా నుంచి సమాధానం లేదు..ధర్మస్థలపై నీచమైన ఆరోపణలు చేసిన భీమాపై పోలీసులకు అనుమానం వచ్చింది..దీంతో లోతుగా దర్యాప్తు నిర్వహించగా ఆశ్చర్యకరమైన నిజాలు బయట పడ్డాయి..విచారణలో భీమా కూడా మాట మార్చాడు..ఒక వ్యక్తి వచ్చి ఒక పుర్రె ఇచ్చి పోలీసులకు ఇమ్మన్నారని,, కోర్టులో పిటిషన్ కూడా వారే వేయించారని,, నేను 2014 నుంచి తమిళనాడులోనే ఉన్నానని అతడు తెలపడంతో సిట్ అధికారులు అరెస్టు చేశారు.