ఆకస్మిక మరణాలతో కొవిడ్ వ్యాక్సిన్లకు సంబంధం లేదు-కేంద్ర ఆరోగ్యశాఖ
యువత ఆకస్మిక మరణాలకు మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్..
అమరావతి: పెద్దలలో ఆకస్మిక మరణాలకు, కోవిడ్-19 వ్యాక్సిన్‌ల మధ్య ప్రత్యక్ష సంబంధం లేదని ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoHFW) బుధవారం ధృవీకరించింది..ఆకస్మిక మరణాలకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది..ఇటీవల సంభవిస్తున్న ఆకస్మిక మరణాలకు,,కోవిడ్ వ్యాక్సిన్ తో ఎటువంటి సంబంధం లేదని వెల్లడించింది..ICMR, AIIMS చేసిన అధ్యయనాలలో కోవిడ్-19 వ్యాక్సిన్లకి ఆకస్మిక మరణాలకు మధ్య ఎటువంటి సంబంధం లేదని తేలిందని ఆరోగ్య శాఖ ప్రకటించింది..2021 అక్టోబర్ నుంచి మార్చి 2023 మధ్య ఆరోగ్యంగా ఉండి అకస్మాత్తుగా మరణించిన వ్యక్తులపై వైద్యులు విస్తృత అధ్యయనాలు చేశారని తెలిపింది..COVID-19 వ్యాక్సిన్, యువకులలో ఆకస్మిక మరణ ప్రమాదాన్నికి సంబంధం లేదని,, యువత ఆకస్మిక మరణాలకు మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ కారణం అయివుండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది..మరణాలకు వ్యాక్సిన్లే కారణమనే ప్రచారం సత్యదూరమైన ప్రచారం అని పేర్కొంది.