దీపావళి నాటికి బిఎస్ఎన్ఎల్ కొత్త UPI యాప్ సేవలు?
అమరావతి: భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల లక్షల కోట్ల రూపాయల్లోకి చేరుకుంటొంది.. దాదాపు ప్రతి ఒక్కరు ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌లను ఉపయోగిస్తున్నారు.. పే మెంట్ యాప్‌లకు పెద్ద సవాలు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది.. బిఎస్ఎన్ఎల్ తన కొత్త UPI యాప్ సేవలను ప్రారంభించబోతోంది.. దీనికి BSNL Pay అని పేరు పెట్టినట్లు సమాచారం.. ఈ సేవలు భీమ్ యాప్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి.
2025 దీపావళి నాటికి:- కంపెనీ అధికారికంగా BSNL Pay లాంచ్ తేదీని ప్రకటించలేదు.. కొన్ని నివేదికల ప్రకారం, ఇది 2025 దీపావళి నాటికి ప్రారంభమవుతందని అంచనా వేస్తున్నారు.. మరో ముఖ్య విషయం ఏటంటే దీని కోసం ప్రత్యేక యాప్ బదులుగా, ఈ సౌకర్యం BSNL సెల్ఫ్ కేర్ యాప్‌లోనే లభిస్తుంది.. ప్రస్తుతం BSNL సెల్ఫ్ కేర్ ఉపయోగిస్తున్న కస్టమర్లు కొత్త యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవలసిన అవసరం లేదు.. ఇతర యాప్‌ల కంటే తక్కువ ఛార్జెస్ ఉండే అవకాశం,,BHIM UPI ప్రోటోకాల్ ఆధారంగా ఉండటం వల్ల అధిక భద్రత వుంటుంది.