సుప్రీంకోర్టు వెలువరిస్తూన్న కొన్ని తీర్పులు, లాయర్లను ఆసహనంకు గురి చేస్తున్నాయా?
సీజెఐపై షూ విసిరేందుకు..
హైకోర్టు న్యాయమూర్తులపై అవినితి ఆరోపణలు:- డిల్లీ హైకోర్టు నాయ్యమూర్తిగా పనిచేస్తున్న యశ్వంత్ వర్మ నివాసంలో కోట్ల రూపాయలు పట్టు పడడం,,అతినిపై విచారణకు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు నెలల సమయంలో తీసుకోవడం జరిగింది. ఈలాంటి సంఘటలను జరిగిన నేపధ్యంలో ప్రజల్లో,,లాయర్లల్లో న్యాయమూర్తులపై గౌరవం సన్నగిల్లుతుందేమో అన్పిస్తుంది.?
“”కొన్ని రోజుల క్రితం సీజేఐ గవాయ్,, ఓ కేసులో చేసిన వ్యాఖ్యల వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఖజురహోలోని ఏడు అడుగల విష్ణు విగ్రహాన్ని పునర్ ప్రతిష్టించాలని దాఖలు చేసిన కేసులో సీజేఐ గవాయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ కేసును ఆయన డిస్మిస్ చేస్తూ వెళ్లి ఆ దేవుడినే అడుక్కోవాలన్న కామెంట్ చేశారు. విష్ణువుకు వీరభక్తుడిని అని చెప్పుకుంటున్నావు కాదా, వెళ్లి ఆ దేవుడినే ప్రార్థించుకో, అదో ఆర్కియాలజీ సైట్ అని, దానికి ఏఎస్ఐ పర్మిషన్ అవసరం ఉంటుందని ఆ కేసులో సీజేఐ వ్యాఖ్యానించారు.””
అమరావతి: దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెలువరిస్తూన్న కొన్ని తీర్పులపై అడ్వకేట్స్ లో సహనం తగ్గిపొతుంది అనేందుకు సోమవారం జరిగిన సంఘటన రుజువు చేస్తొంది. సోమవారం ఉదయం సుప్రీంకోర్టులో కేసుల విచారణకు సంబంధించి కార్యకలాపాలు జరుగుతుండగా (CJI) భారత ప్రధాన న్యాయమూర్తి B.R గవాయ్ పై ఓ లాయర్ షూ విసిరేందుకు యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సదరు లాయర్‌ను అడ్డుకుని బయటకు తీసుకెళ్లారు. కోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. విచారణ సమయంలో డయాస్ వద్దకు వెళ్లిన సదరు లాయర్,, షూ తీసి CJI పైకి విసిరేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది లాయర్‌ని అడ్డుకుని బయటకి తీసుకని వెళ్లారు.అనంతరం పోలీసులకు అప్పగించారు. ఆ సమయంలో ఆ న్యాయవాది “సనాతనానికి జరిగే అవమానాన్ని మేము సహించం”.. అంటూ గట్టిగా నినదించాడు. ఈ సంఘటనతో కోర్టులో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. స్పందించిన సీజేఐ ఈ విషయాన్ని తనని ప్రభావితం చేయదని పేర్కొన్నారు. మిగతా లాయర్లు తమ వాదనలు కొనసాగించాలని ఆదేశించారు.