శబరిమలలో వున్న అన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో వారానికి ఒకసారి తనిఖీలు నిర్వహించాలి-హైకోర్టు
అమరావతి: మండల-మకరవిళక్కు సీజన్ లో శబరిమల ప్రాంతంలో వ్యాపారం నిర్వహిస్తున్నఅన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాళ్లల్లో కనీసం వారానికి ఒకసారి క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (TDB) విజిలెన్స్ విభాగాన్ని కేరళ హైకోర్టు ఆదేశించింది.. శబరిమల, ఎరుమేలి యాత్రికులకు అందించే ఆహారం, పానీయాలు పరిశుభ్రంగా, హానికరమైన పదార్థాలు లేకుండా, సురక్షితమైన నీటితో తయారు చేయాలని కోరుతూ అఖిల భారతీయ అయ్యప్ప సేవా సంఘం దాఖలు చేసిన పిటిషన్ ను విచారిస్తూ ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి..
అపరిశుభ్రమైన-దారుణమైన:- ఎరుమేలి లోని కొన్ని ఆహార దుకాణాలు అపరిశుభ్రమైన-దారుణమైన పరిస్థితులలో భోజనం తయారు చేస్తున్నాయని, పండుగ సీజన్ లో ప్రభుత్వం నియమించిన అధికారులు వాటిని పట్టించు కోవడం లేదన్న ఆరోపణలను జస్టిస్ లు రాజా విజయ రాఘవన్-కెవి జయ కుమార్ లతో కూడిన ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది..లక్షలాది మంది భక్తులకు ఆహార భద్రతను నిర్ధారించడంలో ఇటువంటి లోపాలు కనిపించడం పట్ల కోర్టు “దిగ్భ్రాంతికి-నిరాశకు” లోనవుతుందని పేర్కొంది..
కోర్టుకు తెలియజేయండి:- ప్రతి తీర్థ యాత్ర సీజన్ ప్రారంభానికి ముందు, కేరళ రాష్ట్ర ప్రభుత్వం శబరిమలలో సురక్షితమైన తాగు నీరు-పరిశుభ్రమైన ఆహారం లభ్యతను నిర్ధారించడానికి అన్ని ఏజెన్సీలు-విభాగాల సమావేశాలను ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది.. శబరిమల స్పెషల్ కమిషనర్ విజిలెన్స్ నివేదికలను సమీక్షించడం-అవసరమైతే కోర్టుకు తెలియజేయడం కూడా బాధ్యత అని స్పష్టం చేసింది..అదనంగా, ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం, 2006ను ఖచ్చితంగా పాటించాలని ఆరోగ్యశాఖ కమిషనరను అదేశించింది.ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన వారిని బ్లాక్ లిస్ట్ చేయాలని టీడీబీని హైకోర్టు ఆదేశించింది.