ఫంక్షన్లలో నిషేధిత ప్లాస్టిక్ వినియోగిస్తే భారీ జరిమానాలు తప్పవు-కమిషనర్
నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలో జరిగే వివాహ శుభకార్యాలు, పబ్లిక్ మీటింగులు, ఫంక్షన్ హాళ్లు, హోటళ్ళు, వైన్ షాపులు, రెస్టారెంట్లలో ఏర్పాటు చేసే ఆహార పదార్థాల సరఫరాలో నిషేధిత సింగల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను వినియోగిస్తే భారీ జరిమానాలు తప్పవని కమిషనర్ సూర్య తేజ హెచ్చరించారు. బుధవారం ప్రకటనలో వివరాలను తెలియజేస్తూ నగరవ్యాప్తంగా ఉన్న క్యాటరింగ్ నిర్వాహకులు, వెడ్డింగ్ ప్లానర్స్, ఇతర ఫంక్షన్ హాళ్ళ నిర్వాహకులు కార్యక్రమాల్లో భాగంగా వాటర్ బబుల్స్, డిస్పోజల్ ప్లాస్టిక్ గ్లాసులు, స్పూనులు, ప్లేట్లు, కవర్లు తదితర 120 మైక్రోన్లకన్నా తక్కువ స్థాయి గల సింగల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను వినియోగించినట్లు తమ దృష్టికి వస్తే నిర్వాహకులకు లక్ష రూపాయల వరకు భారీ జరిమానా విధిస్తామని తెలియజేశారు.