తల్లి పేరుతో ఒక మొక్కను నాటాలి-ప్రధాని మోదీ
సింధూరు మొక్కను..
అమరావతి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు, ప్రత్యేక చెట్ల పెంపకం (డ్రైవ్‌తో) తల్లి పేరుతో ఒక మొక్క (ఏక్‌పెడ్ మాకేనామ్) అనే కార్యక్రమంలో విసృతంగా ప్రజల్లో తీసుకుని వెళాల్సి బాధ్యత అందరిపైన వుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.. గురువారం ఢిల్లీలోని భగవాన్ మహావీర్ వనస్థలి పార్కులో ప్రధాని ఒక మొక్కను నాటారు. ఆరావళి పర్వతశ్రేణుల్లో తిరిగి అడవులను పెంచే ప్రయత్నంలో ఇది ఒక భాగం అన్నారు..ఆరావళి పర్వతశ్రేణుల్లో పచ్చదనం తీసుకుని వచ్చేందుకు గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ చేపట్టడడం జరిగిదని ఈ సందర్బంగా పేర్కొన్నారు..ఈ కార్యక్రమంలో డిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్త తదితరులు పాల్గొన్నారు.

సింధూర మొక్క:- గుజరాత్‌లోని కచ్‌లో 1971 యుద్ధంలో అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శించిన మహిళల బృందం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సింధూర మొక్కలను బహూకరించింది..ఇందుకు సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ,నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తన నివాసం 7, లోక్ కళ్యాణ్ మార్గ్ లో ఈ సిందూర్ మొక్కను స్వయంగా నాటారు.

