CRIMENATIONAL

ఆస్సాం వద్ద జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన 7 ఏనుగులు

అమరావతి: అస్సాంలో శనివారం వేకువజామున 2.17 నిమిషాల‌కు జరిగిన రైలు ప్రమాదంలో 7 ఏనుగులు మృతి చెందాయి.సాయిరంగ్‌-న్యూఢిల్లీ మ‌ధ్య ప్రయాణించే రాజ‌ధాని ఎక్స్‌ ప్రెస్ అస్సాంలోని హోజాయ్ వ‌ద్ద రైలు ఏనుగుల గుంపును ఢీకొట్టిందని హోజాయ్ ఎస్పీ V V రాకేష్ రెడ్డి తెలిపారు. ఏనుగుల‌ను ఢీకొన్న రైలు ప‌ట్టాలు త‌ప్పడంతో అయిదు బోగీలు డిరైల్ అయ్యాయి. ఈ ప్ర‌మాదంలో ప్ర‌యాణికుల‌కు ఎవ‌రికీ గాయాలు కాలేదు.రైల్వే ట్రాక్‌పై ఏనుగులు ఉన్న‌ట్లు లోకో పైలెట్ గుర్తించి, వెంట‌నే అత‌ను ఎమ‌ర్జెన్సీ బ్రేక్‌లు వేసినప్పటికి రైలు, ఏనుగులను ఢీకొట్టింది.

గౌహతికి 126 కిలోమీట‌ర్ల దూరంలో:- మిజోరం రాష్ట్రంలో ఐజ్వాల్ స‌మీపంలో ఉన్న సాయిరంగ్ నుంచి ఢిల్లీలోని ఆనంద్ విహార్ ట‌ర్మిన‌ల్ వ‌ర‌కు రాజ‌ధాని రైలు వెళ్తోంది. గౌహతి ప‌ట్ట‌ణానికి సుమారు 126 కిలోమీట‌ర్ల దూరంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో యాక్సిడెంట్ రిలీఫ్ రైళ్లు, రైల్వే అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్న రెస్క్యూ టీమ్ ఆప‌రేష‌న్ చేపట్టారు. రైలు ప‌ట్టాలు త‌ప్ప‌డం వ‌ల్ల‌, ఏనుగుల శ‌రీర భాగాలు ట్రాక్‌పై చెల్లాచెదురుగా ప‌డిన‌ట్లు అధికారులు చెప్పారు.

ఎలిఫెంట్ కారిడార్ కాని ప్రాంతంలో:- అస్సాం ఎగువ భాగంతో పాటు ఈశాన్యా రాష్ట్రాల‌కు వెళ్లాల్సిన రైళ్ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. డిరైల్ అయిన కోచ్‌ల్లో ఉన్న ప్ర‌యాణికుల‌ను ఇత‌ర కంపార్ట్‌ మెంట్ల‌కు మార్చారు. ఇతర కోచ్ లతో కలిసి రైలును ఉయదం 6.11 నిమిషాలకు గౌహతికి పంపిచారు. ఎలిఫెంట్ కారిడార్ కాని ప్రాంతంలో ప్ర‌మాదం జ‌ర‌గ‌డం ఆలోచించాల్సి విషయం. ఏ కారణం వల్ల ఏనుగుల గుంపు ఈ ప్రాంతంలో సంచరిస్తుంది అనే విషయంపై సంబంధిత అధికారులు ఆరా తీస్తున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *