అశ్లీల,అభ్యంతరకర కంటెంట్ ప్రారం చేస్తున్న 25 యాప్ లపై నిషేధం
అమరావతి: దేశంలో డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో అశ్లీల,,అభ్యంతరకర కంటెంట్‌ను నిలువరించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది..సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలతో, అనైతిక, చట్ట విరుద్ధమైన కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న 25 OTT యాప్‌లు, వెబ్‌సైట్‌లను నిషేధించింది..ఈ ప్లాట్‌ఫారమ్‌లు సాఫ్ట్ పోర్న్ లేదా లైట్ అడల్ట్ కంటెంట్‌ను అందిస్తున్నాయని,, ఇది భారతీయ సంస్కృతి, నైతికతకు విరుద్ధమని ప్రభుత్వం వెల్లడించింది..ఈ చర్య దేశంలో డిజిటల్ సంస్కృతిని సురక్షితంగా, బాధ్యతాయుతంగా ఉంచే దిశగా ఒక ముందడుగుగా పరిగణించబడుతోంది.
కేంద్రం నిషేధించిన యాప్ లు:-ఉల్లు, ALTT, బిగ్ షాట్స్, డెసిఫ్లిక్స్, బూమెక్స్, నవరస లైట్, గులాబ్ యాప్, కంగన్ యాప్, బుల్ యాప్, జల్వా యాప్, వావ్ ఎంటర్‌టైన్‌మెంట్, లుక్ ఎంటర్‌టైన్‌మెంట్, హిట్‌ప్రైమ్, ఫీనియో, షోఎక్స్, సోల్ టాకీస్, అడ్డా టీవీ, హాట్‌ఎక్స్ వీఐపీ, హల్‌చల్ యాప్, మూడ్‌ఎక్స్, నియాన్ఎక్స్ వీఐపీ, ఫుగి, మోజ్‌ఫ్లిక్స్, ట్రిఫ్లిక్స్ ఉన్నాయి..ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000, ఐటీ నియమాలు, 2021 ప్రకారం, ఈ ప్లాట్‌ఫారమ్‌లను తక్షణమే బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు (ISPలు) ఆదేశాలు జారీ అయ్యాయి..ఈ చర్యతో ప్రజలకు ఈ వెబ్‌సైట్‌లు, యాప్‌లు అందుబాటులో ఉండవు.

