ఇస్రో 100వ ప్రయోగం-నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లిన GSLV F-15
అమరావతి: క్రయోజెనిక్ ఇంజిన్ పరిజ్ఞానాన్ని స్వదేశీయంగా అభివృద్ది చేసుకున్న భారత్,,అంతరిక్ష చరిత్రలో, నేటి ప్రయోగంతో ఇస్రో మరో మైలురాయిని సాధించింది.. ఇస్రో తన 100వ ప్రయోగాన్ని బుధవారం ఉదయం శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి 6-23 గంటలకు GSLV F-15 రాకెట్‌ని ప్రయోగించింది..రెండవ లాంఛ్ ప్యాడ్ నుంచి రాకెట్ నిప్పులు చెరుగుతూ NVS-02 నావిగేషన్ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది.. భూమికి 36 వేల కి.మీ ఎత్తున GTO ఆర్బిట్‌లో (భారత నావిగేషన్ వ్యవస్థ నావిక్ సిరీస్) NVS-02 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనుంది..ఇస్రోకి ఇది 100వ రాకెట్ ప్రయోగం కాగా ఇప్పటి వరకు 500 శాటిలైట్లను నిర్ణిత కక్ష్యలో ప్రవేశ పెట్టింది.. డాక్టర్ నారాయణన్ ఇస్రో ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇది తొలి ప్రయోగం..2025 ప్రారంభంలోనే అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలని డాకింగ్ చేయడం ద్వారా ఇలాంటి టెక్నాలజీ కలిగిన 4వ దేశంగా భారత్ ఎదిగింది.. అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్న ఇస్రో, ఈ సంవత్సరంలో మరో రెండు ఉపగ్రహాలను నింగిలోకి పంపి డాకింగ్ చేయనున్నది.. ఇటీవలే కావేరి ఇంజిన్ పరిక్షించడం ద్వారా మరింత బరువైన ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు మార్గం సుగమం అయింది.