DISTRICTS

మహిళల నుంచి వచ్చే ఫిర్యాదులపైన తక్షణ చర్యలు తీసుకుంటాం-కలెక్టర్ హిమాన్షు శుక్లా

నెల్లూరు: జిల్లాలోని మహిళల సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కరించేందుకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి రాయపాటి శైలజ ఆధ్వర్యంలో ఈ నెల 9న మహిళా జన సున్వాయి పేరుతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఒక ప్రకటన లో తెలిపారు. జాతీయ మహిళా కమిషన్ సూచనలతో మహిళా జన సున్వాయి ( మహిళా సమస్యల పరిష్కార వేదిక ) కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలోని జడ్పి మీటింగ్ హాల్ లో సోమవారం ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం, లీగల్ సెల్ ప్రతినిధులు, పోలీస్ అధికారులు పాల్గొని మహిళల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి వాటిపై తక్షణ చర్యలు తీసుకుంటారని తెలిపారు. గృహ హింస, వేధింపులు లేదా ఇతర అన్యాయాలకు గురైన మహిళలు ఈ ప్రత్యేక డ్రైవ్‌ ను సద్వినియోగం చేసుకుని తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చునని ఆయన తెలిపారు. ఆరోజున అందిన ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించేందుకు సత్వర చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలోని మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *