జిల్లాలో యూరియా నిల్వలు అవసరం కంటే అధికంగా వున్నాయి- జిల్లా వ్యవసాయ అధికారి
డీలర్లకు హెచ్చరిక..
నెల్లూరు: జిల్లాకు రబీ 2025-26 గాను అన్ని పంటలకు అవసరమైన 94383 మెట్రిక్ టన్నులు యూరియా ఎరువు పంపిణీకి ప్రణాళిక చేయడమైనదని నెల్లూరు జిల్లా వ్యవసాయ అధికారి, P. సత్యవాణి ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 10 నాటికి 3593 మెట్రిక్ టన్నులు జిల్లాలో ప్రారంభ నిల్వలు అందుబాటులో ఉన్నా యన్నారు.10వ తేది నుంచి జనవరి 31 వరకు నెల్లూరు జిల్లాలో 76358 మెట్రిక్ టన్నులు అవసరము కాగా ఇప్పటికే 76110 మెట్రిక్ టన్నులు యూరియా సరఫరా సమృద్ధిగా జరిగి, రైతులకు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.
నిల్వలు అధికంగా:- ప్రస్తుతం 18025 మెట్రిక్ టన్నులు యూరియాను ప్రైవేటు డీలర్స్ దగ్గర, కోపరేటివ్ సొసైటీలలో, ఆర్ఎస్కెలలో, మార్క్ పేడ్ గోడౌన్లో, రిటైల్ హోల్సేల్,కంపెనీ గూడౌన్లలో అవసరం కంటే నిల్వలు అధికంగా అందుబాటులో ఉన్నందున జిల్లాలో ఎరువుల కొరత లేదని రైతులకు తెలిపారు. రైతులు ఎరువులను కొనుగోలు చేసే సమయంలో బస్తాపై ముద్రించిన ఎం.ఆర్.పీ ధరను పరిశీలించాలని, నిర్ణీత ధర కంటే అధికంగా చెల్లించరాదని, తప్పనిసరిగా డీలర్ నుండి రసీదు పొందాలని సూచించారు.
డీలర్లకు హెచ్చరిక:- ఎవరైనా డీలర్లు ఎరువుల కృత్రిమ కొరత సృష్టించినా, ఎం.ఆర్.పీ ధరలకు మించి విక్రయించినా, లేదా ఎరువులను మళ్లింపునకు పాల్పడిన పక్షంలో వారి లైసెన్సులు రద్దు చేసి, ఎరువుల నియంత్రణ చట్టం-1985 ప్రకారం కఠిన చర్యలు తీసుకొవడం జరరగుతుందని హెచ్చరించారు.

