నగరపాలక సంస్థ పరిధిలో ఎక్కువ చెట్లు నాటే విధంగా చర్యలు-కమీషనర్ నందన్
నెల్లూరు: సచివాలయ కార్యదర్శులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ సూపర్వైజర్స్ లు నగరంలో ఇంకా ట్రేడ్ లైసెన్స్ పరిధిలోకి రాని వ్యాపార లావాదేవీలను గుర్తించాలని, తదుపరి ట్రేడ్ లైసెన్స్ విధించి ఆ వ్యాపారస్తులు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ ఆదేశించారు. బుధవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో పబ్లిక్ హెల్త్ విభాగంతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఎక్కువ చెట్లు నాటే విధంగా:- ఈనెల 20వ తారీఖున స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలో చెట్లు నాటు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టామని, అందరూ పాల్గొని ఎక్కువ చెట్లు నాటే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.
24 గంటల లోపు చెత్తను తరలించాలి:- నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని మురుగు కాలవల్లో ఎక్కడ చెత్త నిలువకుండా ఎప్పటికప్పుడు పూడికతీత పనులను చేపట్టి కాలువల్లో మురుగు నీరు సజావుగా పారుదలకు చర్యలు చేపట్టాలని, డీసిల్టేషన్ చేసిన తరువాత 24 గంటల లోపు సదరు చెత్తను తరలించే విధంగా చర్యలు చేపట్టాలని పబ్లిక్ హెల్త్ విభాగం వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో నగర్ పాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కనకాద్రి, వెటర్నరీ డాక్టర్ మదన్మోహన్, మలేరియా విభాగం అధికారి జిజియా బాయి, టి.పి.ఆర్.ఓ వాసు బాబు, శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, వార్డు సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు, పబ్లిక్ హెల్త్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.