AP&TGDISTRICTSPOLITICS

నగర మేయర్ ఎన్నికలకు షెడ్యూల్ జారీ-ఢిల్లీలో పెద్దలకు ఫిర్యాదుకై స్రవంతి

ఈనెల 26న మేయర్..

నెల్లూరు: మునిసిపాల్ కార్పరేషన్ కు సంబంధించి నగర మేయర్ ఎన్నిక జరపాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని సోమవారం ఆదేశాలు జారీ చేసారు. ఈనెల 26న మేయర్ ఎన్నికకు సంబంధించి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు నెల్లూరు తో పాటు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. నెల్లూరుకు సంబంధించి మేరే ఎన్నికలకు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి డిప్యూటీ ఎన్నికలకు సంబంధించి కార్పొరేటర్లకు 20వ తేదీ లోగా నోటీసులు అందించాలని సూచించారు..

కేంద్ర పెద్దల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం:- గిరిజనులకు జరుగుతున్నా అన్యాయాన్ని కేంద్ర పెద్దల దృష్టికి తీసుకువెళ్లేందుకు మాజీ మేయర్ పొట్లూరి స్రవంతి ఢిల్లీకి చేరుకుంది. రెండు రోజుల పాటు అక్కడే మక్కం వేసి గిరిజనులకు జరుగుతున్నా అన్యాయాన్ని కేంద్ర పెద్దలతో పాటు, కేంద్ర గిరిజన నేతలను కలిసి వారికి వివరించే ప్రయత్నం చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల పై కుట్రపూరితంగా వ్యవహరించిన తీరును వారికి వివరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తో చేతులు కలిపి ఎన్నికల కమిషన్.. గిరిజనులకు చేస్తున్న అన్యాయాన్ని కూడా వివరించనున్నట్లు సమాచారం. గత 16 రోజులుగా గిరిజన సంఘాల ఐక్యవేదిక చేపట్టిన రిలే నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్ష కు వస్తున్న స్పందన పై కూడా కేంద్ర పెద్దలకు తెలిపే అవకాశం ఉంది. అవసరమైతే పార్లమెంట్ ఎదుట మాజీ మేయర్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,మంత్రినారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లు గిరిజనుల గొంతు కోశారన్న విషయాన్ని కూడా అక్కడ మీడియకు వివరిస్తారా??.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *